Atchannaidu : ఆ నలుగురే కాదు.. 40మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నుంచి నలుగురు కాదు 40మంది టచ్ లో ఉన్నారు. మేం వస్తామంటే మేం వస్తాం అంటున్నారు. ఎవరిని తీసుకోవాలో వద్దో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.(Atchannaidu)

Atchannaidu : ఆ నలుగురే కాదు.. 40మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

Atchannaidu Challenge

Atchannaidu : వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు వైసీపీ నుంచి 40మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు అని చెప్పారు. రోజూ తమకు ఫోన్లు వస్తున్నాయని అన్నారు. అయితే ఎవరిని తీసుకోవాలి? ఎవరిని తీసుకోవద్దు? అనే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

”వైసీపీ నుంచి నలుగురు కాదు 40మంది టచ్ లో ఉన్నారు. మేం వస్తామంటే మేం వస్తాం అంటున్నారు. ఎవరిని తీసుకోవాలో వద్దో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై సజ్జలకు సమాచారం ఎక్కడిది? ఎవరు ఎవరికి ఓటేశారో మీకెలా తెలుస్తుంది? ఎన్నికల సంఘం.. సజ్జలపై యాక్షన్ తీసుకోవాలి” అని అచ్చెన్నాయుడు అన్నారు.(Atchannaidu)

Also Read..Vizayanagaram Lok Sabha Constituency : రాజుల కోట..కాకలు తీరిన నేతల అడ్డా..విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో విజయం ఎవరిది?

వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురిచేసినా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని అచ్చెన్న అన్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమను సంప్రదించలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది రహస్య ఓటింగ్ అని.. ఎవరు ఎవరికి ఓటు వేసిందనేది తెలిసే అవకాశమే లేదన్నారు. అలాంటిది రహస్య ఓటింగ్‌ ఓటింగ్ వివరాలు ఎలా తెలిశాయో సజ్జల సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సీక్రెట్ ఓటింగ్‌కు విఘాతం కలిగించే వారిపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.(Atchannaidu)

Also Read..Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. సంచలన ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఫలితాలు తెలుగుదేశం శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వైసీపీ నుండి సస్పెండ్ అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇక సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లటానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నలుగురు కాదు.. 40మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తామంటున్నారని అచ్చెన్న అనడం సంచలనంగా మారింది. అచ్చెన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.