Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

అవనిగడ్డలో సింహాద్రి రమేష్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానం కావడంతో.. టీడీపీ, జనసేన కలిస్తే.. సింహాద్రి రమేష్‌కు ఎదుర్కొనేందుకు బలం సరిపోదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

Machilipatnam Lok Sabha Constituency

Machilipatnam Lok Sabha Constituency : అందరి చూపు.. ఇప్పుడు బందరు పైనే ! వివాదాలకు, విభేధాలకు.. పెట్టింది పేరు మచిలీపట్నం రాజకీయం. గన్నవరం మంటలు రేగింది అక్కడే.. నాని ద్వయం చక్రం తిప్పేది అక్కడే ! దీంతో మంచిలీపట్నం పార్లమెంట్‌ పరిధితో పాటు.. ఆ ఏడు అసెంబ్లీలో ఏం జరగబోతోందని రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి మచిలీపట్నం పొలిటికల్ సినారియో ఏంటి.. వైసీపీ సిట్టింగ్‌ల్లో ఎవరిని పక్కనపెట్టే చాన్స్ ఉంది.. కొడాలి, వంశీకి చెక్ చెప్పేందుకు టీడీపీ వ్యూహం ఏంటి.. గన్నవరం పరిణామాలు రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పాయ్. వైసీపీని వెంటాడుతోన్న టెన్షన్ ఏంటి.. టీడీపీ బలహీనతలు ఏంటి.. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏంటి.. తేల్చేద్దాం క్లియర్‌కట్‌గా..

balasowri

balasowri

READ ALSO : Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

బాలశౌరి మళ్లీ పోటీ చేస్తారా ? కొత్త వ్యక్తిని వైసీపీ బరిలోకి దింపనుందా..

మచిలీపట్నం పార్లమెంట్‌కు.. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పార్లమెంట్ గురించి.. అసెంబ్లీ స్థానాల గురించి మరింత చర్చ జరుగుతోందిప్పుడు ఏపీ రాజకీయాల్లో ! గన్నవరం ఎపిసోడ్‌కు తోడు.. వైసీపీ ఫైర్‌బ్రాండ్‌లు ఇద్దరు నానిలు.. ఇదే పార్లమెంట్‌ పరిధిలోకి రావడం.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కిస్తోంది. పొత్తుల ప్రభావం ఈ పార్లమెంట్ స్థానంలో ఎలా ఉండబోతుందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణపై 60వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఐతే వచ్చే ఎన్నికల్లో బాలశౌరి మళ్లీ పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కొన్ని వివాదాల కారణంగా వచ్చే ఎన్నికల్లో బాలశౌరిని తప్పించి.. కొత్త వ్యక్తిని ఎంపీ బరిలో దింపేందుకు వైసీపీ ప్లాన్‌ చేస్తుందనే ప్రచారం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Konakalla-Narayana-radha

Konakalla-Narayana-radha

బీసీలలో పట్టున్న నేతగా కొనకళ్ళకు గుర్తింపు…టిడిపి ఎంపి అభ్యర్ధిగా పరిశీలనలో వంగవీటి రాధా పేరు

కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే మచిలీపట్నం పార్లమెంట్‌ బరిలో నిలపాలని వైసీపీ భావిస్తోంది. దీంతో బాలశౌరికి మళ్లీ టికెట్ కేటాయిస్తారా.. వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి బరిలోకి దించుతారా అనేది తేలాల్సి ఉంది. అటు ప్రతిపక్ష టీడీపీలో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయ్‌. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. మరోసారి సైకిల్ పార్టీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. 2009, 2014లో ఈయన ఈ స్థానం నుంచి గెలిచారు. ఐతే గత ఎన్నికల్లో ఓడిన తర్వాత.. నారాయణ చురుకుగా ఉండటం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. గౌడ సామాజికవర్గానికి చెందిన నారాయణకు.. బీసీ ఓటర్లలో మంచి పట్టు ఉంది. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గౌడ సామాజికవర్గం ఓట్లు లక్షన్నరకు పైగా ఉన్నాయ్. ఐతే కొనకళ్లకు ప్రత్యామ్నాయం చూడాలని పార్టీలో ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయ్. దీంతో బలహీనవర్గాల నుంచి నాయకుడి కోసం అన్వేషణ జరుగుతున్నా.. నారాయణ స్థాయి గల నేత టీడీపీకి కనిపించడం లేదు.

పార్లమెంట్‌ పరిధిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కొనకళ్ల వెనకడుగు వేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. దీంతో టీడీపీ తరఫున కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయ్. వంగవీటి రాధాని మచిలీపట్నం పార్లమెంట్ బరిలో దించితే ఆ ప్రభావం ఉమ్మడి జిల్లాపై ఉంటుందన్నది సైకిల్ పార్టీ నేతల ఆలోచన. ఇప్పటికే రాధా ముందు ఈ ఈ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు 2లక్షల 70వేలకు పైగా ఉన్నాయ్. 2019లో పార్లమెంట్ పరిధిలో జనసేనకు లక్ష 11వేలకు పైగా ఓట్లు వచ్చాయ్. ఐతే రాధా ఇక్కడి నుంచి పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా సైకిల్ పార్టీలో వినిపిస్తున్నాయ్. రాధాకు ఆప్తులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ నియోజకవర్గాలు.. ఈ పార్లమెంట్‌ పరిధిలోనే ఉన్నాయ్. దీంతో వారికి నష్టం కలిగించేలా రాధా ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది క్వశ్చన్‌ మార్క్‌గా మారింది. రాధా పోటీకి అంగీకరిస్తే.. టీడీపీ అభ్యర్థి ఆయనే అవుతారు. లేదంటే బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చే చాన్స్ ఉంది.

అదే క్రమంలో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో.. మచిలీపట్నం అసెంబ్లీతో పాటు పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, గుడివాడ, పెడన, గన్నవరం నియోజకవర్గాలు ఉన్నాయ్. ఇందులో పామర్రు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కాగా.. మిగిలినవి జనరల్ !

READ ALSO : Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన!

vamsi-mohan

vamsi-mohan

టీడీపీ నుంచి గెలిచి ఫ్యాన్‌ పార్టీ చెంతకు చేరిన వంశీకి గన్నవరం సీటు ఖాయమా!
గన్నవరం అసెంబ్లీ.. మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోనే అత్యంత వివాదాస్పద నియోజకవర్గం. అలాంటి సెగ్మెంట్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి.. ఎమ్మెల్యే వంశీకి, టీడీపీ నేతల మధ్య జరిగిన మాటల యుద్ధంతో.. ఒక్కసారిగా గన్నవరంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. గన్నవరంలో వల్లభనేని వంశీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. తర్వాత ఫ్యాన్‌ పార్టీ వైపు జరిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున వంశీతో సహా ముగ్గురు నేతలు బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో టికెట్ ఫైట్ ఆసక్తికరంగా మారింది.

భువనేశ్వరిపై వ్యాఖ్యలతో వంశీకి వ్యతిరేకంగా కమ్మ సామాజికవర్గం… యార్లగడ్డ వెంకట్రావు వైపు టీడీపీ నేతల చూపు
వల్లభనేని వంశీతో పాటు.. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు.. వైసీపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ వైసీపీలో గ్రూప్‌ ఫైట్ పెరిగిపోయింది. దీంతో అధిష్టానం ఎంటర్ అయి.. చర్చలు జరపగా.. దుట్టా రామచంద్ర రావు కాస్త సైలెంట్ అయ్యారు. ఐతే యార్లగడ్డ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. అటు వంశీ కూడా గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చెప్తున్నారు. యార్లగడ్డ కూడా టికెట్‌ మీద ధీమాతో ఉన్నారు. దీంతో వైసీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. గన్నవరంలో ప్రస్తుతం టీడీపీ ఇంచార్జిగా బచ్చుల అర్జునుడు ఉన్నారు. ఆయన శక్తికి మించి పని చేస్తున్నా.. స్థానిక నేతలు కలిసిరావడం లేదనే చర్చ జరుగుతోంది. కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటే గన్నవరంలో.. ఆ వర్గం నేతలు సైలెంట్‌గా ఉన్నారు. ఆర్థికంగా బలవంతుడైన వంశీని తట్టుకోవడం అర్జునుడికి సాధ్యం కాదనే అభిప్రాయంలో పార్టీ అధిష్టానం కనిపిస్తోంది. దీంతో యార్లగడ్డ వైపు చూస్తోంది. ఆయన ఓకే అంటే.. పార్టీకి ఎదురు ఉండదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక అటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్‌ను.. గన్నవరం నుంచి బరిలో దింపే చాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల వ్యవహారంలో వంశీకి కమ్మ సామాజికవర్గ ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.

READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

kodali-nani

kodali-nani

గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్న తెలుగుదేశం…
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లోనూ వైసీపీ తరఫున ఆయనే మళ్లీ బరిలోకి దిగడం ఖాయం. కీలక నియోజకవర్గం అయిన గుడివాడలో టీడీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. కొడాలి నానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది. రావి వెంకటేశ్వరరావు ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. ఐతే వర్గపోరు ఇక్కడ టీడీపీకి ఇబ్బందిగా మారింది. పార్టీ మూడు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయింది. రావి వర్గం, పిన్నమనేని వర్గం, శిష్ట్లా లోహిత్‌ వర్గానికి తోడు ఇప్పుడు వెనిగండ్ల రాము వర్గం తెరపైకి వచ్చింది. ఎవరికి వారు టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. ఏ గ్రూపుతో కలిసి పనిచేయాలో అర్థం కాని పరిస్థితి. ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము.. తన ట్రస్ట్ ద్వారా ఎస్సీ ఓట్లను టార్గెట్‌ చేసుకుని రాజకీయం చేస్తున్నారు. నియోజకవర్గంలోని చర్చిలన్నింటినీ ఓసారి చుట్టేసిన రాము.. ఎస్సీ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాము భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో… ఈ విషయాన్ని ఆ సామాజికవర్గంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వెనిగండ్ల రాముకే టికెట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పార్టీ అధినేత నుంచి ప్రకటన కూడా ఉండబోతుందని టాక్.

jogi-ramesh

jogi-ramesh

READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

పెడనలో మంత్రి జోగి రమేష్ తిరిగి బరిలో నిలిచేనా ! పొత్తులో ఈ సీటును టిడిపి జనసేనకు కేటాయిస్తుందా?
పెడనలో మంత్రి జోగి రమేష్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019ఎన్నికల ముందు పెడన వచ్చి విజయం సాధించారు జోగి రమేష్. అప్పటివరకు నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న ఉప్పాల రాంప్రసాద్.. తన సీటును అధిష్టానం సూచన మేరకు త్యాగం చేశారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన ఉప్పాల హారిక జడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. 2024లో తమ కుటుంబం నుంచే ఓ వ్యక్తి అసెంబ్లీ బరిలో ఉంటారని వాళ్లు చెప్తున్నారు. ఐతే అధిష్టానం అనుమతి ఇస్తే.. తాను మైలవరంలో పోటీ చేస్తానని.. పెడనలో మాత్రం తన కుమారుడిని అభ్యర్థిగా నిలబెడతానని జోగి రమేష్ చెప్పుకుంటారని టాక్‌. కుమారుడు రాజీవ్‌ను నియోజవర్గంలో విస్తృతంగా తిప్పుతున్నారు రమేష్. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందని ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్‌ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. ఐతే గ్రూప్ రాజకీయాలు సైకిల్ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయ్. మెతక వైఖరికి తోడు.. సీనియర్లను కలుపుకు వెళ్లలేకపోతున్నారని కృష్ణప్రసాద్‌ మీద టాక్ ఉంది. పెడనలో గౌడ సామాజిక వర్గం ఓట్లు 35వేల వరకు ఉంటాయ్. ఐతే వాళ్లంతా మంత్రి జోగు రమేష్‌ మీద వ్యతిరేకతంగా ఉన్నారు. అది టీడీపీకి కలిసివచ్చే అవకాశం ఉంది. కృష్ణప్రసాద్‌తో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్‌తో పాటు.. స్థానిక నేత బొడ్డు వేణుగోపాల్ కూడా కూడా ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన అఖిల భారత సర్వీసు అధికారిని.. ఆఖరి నిమిషంలో టీడీపీ తెరపైకి తెస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఐతే ఇక్కడ కాపు ఓటర్లు కీలకం కాగా.. పొత్తు కుదిరితే జనసేనకు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

pardhasaradhi

pardhasaradhi

పెనమలూరులో పార్ధసారధికి ఢీకొట్టేందుకు తెలుగుదేశం ఎవర్ని బరిలోకి దింపనుంది…
పెనమలూరులో కొలుసు పార్థసారథి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని పార్థసారధి చెప్తున్నా.. పార్టీలో మాత్రం రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. పార్థసారధిని ఎంపీగా పంపుతారనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. పార్ధసారధి ప్రధాన అనుచరుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్ రావు పేరు పరిశీలనలో ఉందనే టాక్ నడుస్తోంది. టీడీపీ నుంచి బోడె ప్రసాద్‌ ఇంచార్జిగా ఉన్నారు. ఆయన యాక్టివ్‌గా పనిచేస్తున్నా.. గెలిచే స్థాయిలో పని ఉండటం లేదనేది పార్టీ హైకమాండ్ అభిప్రాయం. అటు బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మధ్య గ్రూప్ వార్ నడుస్తోంది. టీడీపీలోకి పలువురు సీనియర్ నేతలు కూడా.. బోడె ప్రసాద్‌కు సహరించడం లేదన్న టాక్ ఉంది. ఎమ్మెల్యే పార్థసారథిపై పోరాటం చేయడానికి నేతలెవరూ కలిసి రావడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో అభ్యర్థి విషయంలో టీడీపీ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

aneel kumar

aneel kumar

పామర్రులో మళ్ళీ బరిలోకి దిగనున్న కైలె అనిల్ కుమార్, ఎలగైనా గెలవాలన్న ప్రయత్నాల్లో తెలుగుదేశం

పామర్రులో కైలె అనిల్‌ కుమార్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ ఆయనే పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయ్. నియోజవర్గానికి సంబంధించి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేకపోవడం అనిల్‌కు కలిసివచ్చే అంశం. వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్‌ రాజా ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. అందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో ఉప్పులేటి కల్పన వర్గంలో విభేదాలు కనిపించినా.. ఆ తర్వాత అన్నీ క్లియర్ అయ్యాయ్. మాజీ ఎమ్మెల్యే డీవై దాసు కూడా ఇక్కడ కీలకపాత్ర పోషిస్తారు. ఆయనను కలుపుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సెగ్మెంట్‌లో కొడాలి నాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో కుమార్‌ రాజా.. వెనిగండ్ల రాము సహాయం తీసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు.. ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. దీంతో ఎలాగైనా ఈసారి జెండా ఎగురవేయాలన్న కసితో ఉంది టీడీపీ.

ramesh

ramesh

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

ఆవనిగడ్డలో అభ్యర్ధిని మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం….,

అవనిగడ్డలో సింహాద్రి రమేష్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానం కావడంతో.. టీడీపీ, జనసేన కలిస్తే.. సింహాద్రి రమేష్‌కు ఎదుర్కొనేందుకు బలం సరిపోదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఐతే రమేష్ మాత్రం తాను లేదా తన కుమారుడు వికాస్‌ బరిలో ఉంటామని రమేష్ ధీమాగా చెప్తున్నారు. ఆ మధ్య అంబటి రాంబాబు పేరు కూడా వినిపించింది. ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా మండలి బుద్ధప్రసాద్ కొనసాగుతున్నారు. సౌమ్యుడిగా పేరు ఉన్న బుద్ధప్రసాద్‌.. పార్టీలో అంతగా యాక్టివ్‌గా ఉండడం లేదనే భావన ఉంది. ఐతే తన కుమారుడిని ఈసారి ఎన్నికల బరిలో దింపాలని ప్రసాద్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డలో కాపు ఓటర్లు 60వేలకు పైనే ఉంటారు. పొత్తు కుదిరితే.. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయ్. వంగవీటి రాధా అసెంబ్లీకి పోటీ చేయాలి అనుకుంటే.. ఇక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలు లేకపోలేదని మరో టాక్.

perni nani

perni nani

మచిలీపట్నంలో ఈ సారి బరిలోకి దిగనున్న పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి,… ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న రవీంద్ర

మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లో తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణమూర్తి కూడా నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్నారు. పార్టీకి సంబంధించి ప్రతీ కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. గడపగడపకు కార్యక్రమం ఆయనే నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని… తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని ఇప్పటికే కోరారు పేర్ని నాని. వారసులకు టికెట్లు లేవు అంటున్న జగన్ నిర్ణయం.. ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత బలంగా ఉందనే భావనతో ఉన్న టీడీపీ.. ఈ సీటు కచ్చితంగా తమదే అనే ధీమాతో ఉంది. పెద్దగా గ్రూపులు లేకపోవడం టీడీపీకి అడ్వాంటేజ్‌గా మారింది. జనసేనతో పొత్తు కుదిరితే భారీగా కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఇక అటు కొల్లు రవీందర్ కూడా.. నిరంతరం కేడర్‌కు అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కొల్లుపై హత్యాయత్నం ఘటనపై ఇప్పటికీ చర్చ జరగుతూనే ఉంటుంది. మత్స్యకారవర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు.. ఆ సామాజికవర్గం ఓట్లు పూర్తిగా పడడం ఖాయం. అటు నాని కాకుండా ఆయన కుమారుడు కిట్టు పోటీ చేస్తే.. కొల్లు రవీంద్రకు ప్లస్ అవుతుంది.