Telangana Politics: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

జానారెడ్డి సమక్షంలోనే ఈ ఇరువురు నేతలు చర్చలు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక నాగంను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకుంది. నాగంకు నచ్చజెప్పి దామోదర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Telangana Politics: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

Damodar Reddy with Harish rao

Updated On : April 20, 2023 / 6:37 PM IST

Telangana Politics: భారత్ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పార్టీ మారనున్నారు. తొందరలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు దాదాపు ఖరారైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో దామోదర్ రెడ్డికి గ్యాప్ ఏర్పడింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని దామోదర్ రెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దామాదర్ రెడ్డి చేరిక పట్ల సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Karnataka Polls: ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తామని ప్రకటించిన మాజీ సీఎం

దీంతో ఆయనను ఒప్పించే బాధ్యత జానా రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో జానారెడ్డి సమక్షంలోనే ఈ ఇరువురు నేతలు చర్చలు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక నాగంను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకుంది. నాగంకు నచ్చజెప్పి దామోదర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అనుకున్నట్లుగా జరిగితే మే మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కప్పుకోనున్నారు.

Andhra Pradesh : కొండారెడ్డి బురుజు వద్దకొస్తావా? లేదా.. 10టీవీకొస్తావా? చర్చకు నేను రెడీ : లోకేశ్‌కు మంత్రి సవాల్