Andhra Pradesh : కొండారెడ్డి బురుజు వద్దకొస్తావా? లేదా.. 10టీవీకొస్తావా? చర్చకు నేను రెడీ : లోకేశ్‌కు మంత్రి సవాల్

లోకేశ్ కర్నూలు జిల్లాలో దాటిపోయేలోపు కొండారెడ్డి బురుజు లేదా 10టీవీ దగ్గర తేల్చేసుకుందాం వస్తావా? అంటూమంత్రి సవాల్ విసిరారు.

Andhra Pradesh : కొండారెడ్డి బురుజు వద్దకొస్తావా? లేదా.. 10టీవీకొస్తావా? చర్చకు నేను రెడీ : లోకేశ్‌కు మంత్రి సవాల్

Gummunuru Jayaram Nara Lokesh

Andhra Pradesh : యువగళం పాదయాత్రలో కొసాగుతు వైసీపీ నేతలపైనా వారి అవినీతిపైనా నారా లోకేశ్ విమర్శలు సంధిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. దీంట్లో భాగంగా కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్రలో లోకేశ్ కార్మిక శాఖామంత్రి గుమ్మునురు జయరాం అవినీతికి పాల్పడుతున్నారని భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. దీనిపై మంత్రి జయరాం స్పదిస్తు లోకేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో ముగిసే లోపు కర్నూలు కొండారెడ్డి బురుజు లేదా 10టీవీ దగ్గర భూములపై చేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నా సవాళ్లను స్వీకరించి చర్చను నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంటూ సవాల్ విసిరారు.

కర్నూలు పాదయాత్ర ముగిసేలోపు నా సవాళ్ళను స్వీకరిస్తే నేను సిద్ధంగా ఉన్నాను.. లోకేష్ విసిరిన సవాల్ కు నేను సిద్ధం 10టీవీ వేదికగా ఇద్దరం చర్చిద్దామా? అంటూ ఛాలెంజ్ చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో నాకు సవాల్ విసురుతూ నేను చేసిన భూకబ్జాలో సవాల్ కు సవాల్ విసురుతున్నాను.. కర్నూలు జిల్లా దాటిపోయేలోపులా చర్చకు సిద్ధమా? అంటూ ప్రతి సవాల్ విసిరారు. 430 ఎకరాలను నారా లోకేష్ దమ్ముంటే కొనుగోలు చేసి వాల్మీకులకు, బిసిలకు ఇస్తావా లోకేష్ అని సవాల్ విసిరారు మంత్రి జయరాం.

Andhra Pradesh : 10 కిలోమీటర్లు రోడ్డు వేయలేని వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుందా? : ఎంపీ రామ్మెహన్ నాయుడు

మీ హయాంలోనే ఈఎస్ఐలో అవినీతి జరిగింది… నేను అవినీతి పాల్పడినట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా వదిలేస్తా మరి నువ్వూ..మీ తండ్రి శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తారా? అంటూ ప్రశ్నించారు. రెండు ఎకరాల నుండి రెండు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు కదా నీవు, నీతండ్రి ఆ డబ్బులతో 330 ఎకరాలు కొనుగోలు చేసి బిసిలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వు అంటూ ఎద్దేవా చేశారు. సర్పంచ్ గా గెలవలేని లోకేష్ నేను అవినీతి చేశానని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి జయరాం. ఈనెల 30 తేదీలోపు 10రోజుల్లో లోకేష్ వస్తే నా కుటుంబం పైన ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తా నని.. లోకేష్ నా భూములతో పాటు 330 ఎకరాలను కూడా బిసిలకు కొని రిజిస్ట్రేషన్ చేయిస్తావా? అంటూ ప్రశ్నించారు.

నారా లోకేష్ పాదయాత్రలో భూములను రిజిస్ట్రార్ చేస్తావా? అని నాకు సవాల్ విసిరారు. లోకేశ్ సవాల్ ను నేను స్వీకరిస్తున్నా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తావు ? కర్నూలు పాదయాత్ర దాటిపోయేలోపు 10టీవీ వేదిక గాని… కర్నూలు కొండారెడ్డి బురుజు వేదిక గాని ఇద్దరం చర్చిద్దామా…? అని సవాల్ విసిరారు. నీ పాదయాత్ర అయిపోయే లోపు నిర్ణయం తీసుకో లోకేష్ అంటూ సూచించారు. నేను కొన్న భూములను ఇప్పుడున్న ప్రభుత్వ ధరకే రిజిస్ట్రేషన్ చేసిస్తా, అలాగే మిగిలిన 330 ఎకరాల కూడా బీసీలకు కొనుగోలు చేసి పంపిణీ చేయాలన్నారు.

Achchennaidu : వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు : అచ్చెన్నాయుడు