Andhra Pradesh : 10కిలోమీటర్లు రోడ్డు వేయలేని వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుందా? : ఎంపీ రామ్మెహన్ నాయుడు

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేస్తానని సీఎం జగన్ చేసిన హామీలపై టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు సెటైర్లు వేశారు. అప్పుడు ఆస్కార్ లెవెల్లో కోడికత్తి డ్రామా ఆడి అధికారంలోకి వచ్చి ఇప్పుడు స్టిక్కర్ రాజకీయాలు చేస్తున్నారని 10కిలోమీటర్లు రోడ్డే వేయలేకపోయారు పోర్టు నిర్మాస్తారా? అంటూ సెటైర్లు వేశారు.

Andhra Pradesh : 10కిలోమీటర్లు రోడ్డు వేయలేని వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుందా? : ఎంపీ రామ్మెహన్ నాయుడు

TDP MP Rammehan Naidu CM Jagan

Andhra Pradesh : 10కిలోమీటర్లు రోడ్డు కూడా వేయలేని వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుందా? అంటూ టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. నిన్న (ఏప్రిల్ 19,2023) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ సంతబొమ్మాళి మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేస్తానని విశాఖ నుంచి 170 కిలోమీటర్లు చెన్నై- కోల్ కతా నేషనల్ హైవేకు 14కిలోమీటర్ల, ప్రధాన రైల్వే మార్గానికి 11కిలోమీటర్ల దూరంలో 1250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న మూలపేట పోర్టు వల్ల 35వేలమందికి ఉద్యోగాలు అవకాశాలు లభ్యమవుతాయంటూ జగన్ చెప్పిన మాటలకు తనదైన శైలిలో ఎంపీ రామ్మోహన్ నాయుడు సెటైర్లు వేశారు.

10కిలోమీటర్లు రోడ్డు కూడా వేయలేని వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుందా? గ్రామాల్లో కిలోమీటరు రోడ్డు వేయలేని సర్కారు పోర్టులు నిర్మించేస్తుందా అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క పరిశ్రమను తీసుకురాకుండా ఉన్నవాటికి ఉద్వాసన పలికిన జగన్ ప్రభుత్వం వేల ఉద్యోగాలు కల్పించేస్తుందా? ఇదంతా ఎన్నికల స్టంట్ అని మరోసారి అధికారంలోకిరావటానికి మళ్లీ మళ్లీ జగన్ అబద్దాలు చెబుతున్నారని ఈ విషయాన్ని ప్రజలు గమనిచాలని రామ్మోహన్ నాయుడు సూచించారు.

గతంలో టీడీపీ చేసినవాటికే మరోసారి శంకుస్థాపనలు చేస్తు ప్రజల్ని మోసం చేస్తున్న జగన్ ను ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. పోర్టు పేరు, ఊరు మార్చి ప్రజల్ని జగన్ ఏమారుస్తున్నారంటూ విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టు అనేది జగన్ ఆడుతున్న మరో పెద్ద డ్రామా అని అంటూ ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అంటూ ఏపీ మొత్తాన్ని సర్వనాశనం చేసిన జగన్ మూడు ఇకపై విశాఖ నుంచి పాలన మొదలు పెట్టేస్తానంటూ బాబాయి వివేకా హత్య కేసునుంచి ప్రజల దృష్టి మళ్లించటానికి మళ్లీ మళ్లీ డ్రామాలాడుతున్నారంటూ విమర్శించారు. విశాఖ రాజధాని అంటే పదే పదే జగన్ చెబుతున్నా ప్రజలు నమ్మటంలేదన్నారు. విశాఖ రాజధానికి ప్రజలు నమ్మటంలేదని గుర్తించి ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని సెటైర్లు వేశారు.

కోడికత్తితో అస్కార్ లెవల్ లో డ్రామా ఆడి అధికారంలోకి వచ్చి అమాయకుడిని జైలుపాలు చేసి అతని భవిష్యత్తునే నాశనం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఇక ఏపీలో కొత్త కొత్త విధానాలతో ప్రజల్లోకి వెళ్లటానికి యత్నిస్తు ప్రజలచేత ఛీకొట్టించుకున్న వైసీపీ ప్రభుత్వం కొత్తగా స్టిక్కర్ల రాజకీయం చేస్తోంది అంటూ విమర్శించారు. కానీ స్టిక్కర్ల రాజకీయం కూడా బెడిసికొట్టిందని భయపెట్టి ఇళ్లకు జగన్ స్టిక్కర్లు అంటిస్తుంటే ప్రజలు వాటిని చింపేస్తున్నారని స్టిక్కర్ల రాజకీయాన్ని సోషల్ మీడియాలో ప్రజలు భలే భలే సెటైర్లు వేస్తున్నారంటూ సెటైర్లు వేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.