Karnataka Polls: ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తామని ప్రకటించిన మాజీ సీఎం

ఈలోగా తనను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించాలంటూ ఈపీఎస్‌ మరోమారు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారు. తన పార్టీ పదవికి ఎన్నికల సంఘం అంగీకారం లభిస్తే కర్ణాటకలో పోటీ చేయనున్న అభ్యర్థికి బీఫారం జారీ చేయడంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తవని ఆయన పేర్కొన్నారు.

Karnataka Polls: ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తామని ప్రకటించిన మాజీ సీఎం

Palaniswami

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. అయితే ఒకే ఒక స్థానంలో పోటీకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో 3 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ.. ప్రస్తుతం ఒకే ఒక స్థానానికి పోటీ పడుతుండడం గమనార్హం. 1983 కర్ణాటక అసెంబ్లీలో ఒక స్థానాన్ని గెలుచుకున్న అన్నాడీఎంకే.. 2004 వరకు ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే 2004 ఎన్నికల్లో ఆ ఒక్క స్థానాన్ని కోల్పోయింది.

Maharashtra: ఖర్గర్ బహిరంగ సభలో వడదెబ్బ మృతుల సంఖ్య 70 దాటిందట!

వచ్చే మే 10న కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే తమిళులు అధికంగా నివసించే కోలారు, బెంగళూరు సహా నాలుగైదు స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులే ముందు నుంచి చెప్తూ వచ్చారు. కానీ చివరకు పులికేశి నగర్‌ నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేస్తుందని పార్టీ అధినేత బుధవారం స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలో ఆ రాష్ట్ర అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా ఉన్న డి.అన్బరసన్‌ పోటీ చేయనున్నట్లు ఈపీఎస్ ప్రకటించారు.

Prayagraj: అతీక్ అహ్మద్ మర్డర్ కేసులో సీన్ రీక్రియేట్ చేసిన జ్యూడీషియల్ కమిషన్

ఇదిలా ఉండగా కర్ణాటకలో నామినేషన్ల స్వీకరణ గురువారం ముగియనుండటంతో ఈలోగా తనను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించాలంటూ ఈపీఎస్‌ మరోమారు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారు. తన పార్టీ పదవికి ఎన్నికల సంఘం అంగీకారం లభిస్తే కర్ణాటకలో పోటీ చేయనున్న అభ్యర్థికి బీఫారం జారీ చేయడంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తవని ఆయన పేర్కొన్నారు.