Maharashtra: ఖర్గర్ బహిరంగ సభలో వడదెబ్బ మృతుల సంఖ్య 70 దాటిందట!

ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముంబైలోని ఖర్గర్‭లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సామాకి కార్యకర్త అప్పాసాహెబ్ ధర్మాధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు హాజరై అవార్డును అందజేశారు

Maharashtra: ఖర్గర్ బహిరంగ సభలో వడదెబ్బ మృతుల సంఖ్య 70 దాటిందట!

Kharghar event

Maharashtra: ఆదివారం మహారాష్ట్రలోని ఖర్గర్ ప్రాంతంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో 13-14 మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నప్పటికీ 70-75 మంది చనిపోయినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‭కు నోటీసులు పంపిన ఉదయనిధి స్టాలిన్

ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముంబైలోని ఖర్గర్‭లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సామాకి కార్యకర్త అప్పాసాహెబ్ ధర్మాధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు హాజరై అవార్డును అందజేశారు. అయితే, ఈ అవార్డుల కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వారికి ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయకపోవటంతో మూడు గంటల పాటు ఎండలో ఉండే కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ క్రమంలో అనేక మందికి వడదెబ్బ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే 14మంది మరణించారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Karnataka Polls: మోదీ దేవుడు కాదు.. నడ్డా వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత, వేడి గాలుల ప్రభావం తగ్గే వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని జారీ చేస్తుందని కేబినెట్ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా ధృవీకరించారు.