Karnataka Polls: మోదీ దేవుడు కాదు.. నడ్డా వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్

ప్రజాస్వామ్యంలో తమకు సేవ చేసేవారిని ప్రజలే ఎన్నుకుంటారని, ఆశిస్సులు ఇవ్వడానికి నరేంద్రమోదీ ఏమీ దేవుడు కాదని సిద్ధూ అన్నారు. ఈ విషయమై గురువారం ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలని నడ్డాకు సిద్ధరామయ్య సూచించారు.

Karnataka Polls: మోదీ దేవుడు కాదు.. నడ్డా వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్

Siddaramaiah

Karnataka Polls: కర్ణాటకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశిస్సులు కావాలంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో తమకు సేవ చేసేవారిని ప్రజలే ఎన్నుకుంటారని, ఆశిస్సులు ఇవ్వడానికి నరేంద్రమోదీ ఏమీ దేవుడు కాదని సిద్ధూ అన్నారు. ఈ విషయమై గురువారం ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలని నడ్డాకు సిద్ధరామయ్య సూచించారు.

Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‭కు నోటీసులు పంపిన ఉదయనిధి స్టాలిన్

‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుల భవితవ్యం ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు. తమకు సేవ చేసే వారిని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. ఎవరికీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి నరేంద్రమోదీ ఏమీ దేవుడు కాదు. కర్ణాటకకు నరేంద్రమోదీ ఆశిస్సులు ఇస్తారన్న నడ్డా వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యం నుంచి ఆయన కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు సమానమే. రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలకు సమాన గౌరవం, హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం పని చేయదు’’ అని సిద్ధరామయ్య వరుస ట్వీట్లు చేశారు.

Bilawal Bhutto India Visit: భారత్ పర్యటనకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ఎప్పుడంటే..

వచ్చే నెలలో జరగబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. బుధవారం ఆయన వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దాని మీద సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. ఎన్నికల అనంతరం పార్టీ హైకమాండే ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.