Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‭కు నోటీసులు పంపిన ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తమ ప్రభుత్వం మీద నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‭కు నోటీసులు పంపిన ఉదయనిధి స్టాలిన్

Udhayanidhi Stalin and Annamalai

Tamil Nadu: తనపై నిరాధారమైన, పరువుకు నష్టం కలిగేలా ఆరోపణలు చేశారంటూ తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు రాష్ట్ర మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి నోటీసులు పంపారు. అన్నామలై ఇటీవల వెలువరించిన ఆస్తుల జాబితాలో సీఎం స్టాలిన్‌ సహా ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు ఇవేనంటూ ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో సీఎం కుమారుడు అయితన మంత్రి ఉదయనిధికి 2,039 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉదయనిధి తరఫున సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ ద్వారా అన్నామలైకు నోటీసులు పంపారు. 48 గంటల్లో అన్నామలై క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో 50 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ కేసు దాఖలు చేస్తామని మంత్రి ఉదయనిధి హెచ్చరించారు.

Pushpa : సినిమాలో అలా చూపించడం బాధాకరం.. పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐజి..

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తమ ప్రభుత్వం మీద నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనిపై తాను కూడా చట్టపరంగానే తేల్చుకుంటానని అన్నామలై సవాల్ విసిరారు. డీఎంకే డిమాండ్ చేసినట్లుగా క్షమాపణ చెప్పబోనని, అలాగే జరిమానా కట్టనని ఆయన సోమవారం స్పష్టం చేశారు.

Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. రాహుల్ పిటిషన్ తిరస్కరణ

సీనియర్ న్యాయవాది, డీఎంకే రాజ్యసభ ఎంపీ పీ.విల్సన్ భారతి సూచనల మేరకు ఏప్రిల్ 15 నాటి నోటీసు జారీ చేశారు. తమిళనాడులో రాజకీయంగా ముద్ర వేయలేకపోయిన అన్నామలై డీఎంకే నేతలను అప్రతిష్టపాలు చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని, ‘డీఎంకే ఫైల్స్’ వీడియో క్లిప్ వారిపై నిరాధారమైన ఆరోపణలు మాత్రమే చేస్తోందని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. డీఎంకే ఆస్తుల విలువను ఎక్కువ చేసి రూ.1,408.94 కోట్లుగా చూపించారని నోటీసులో పేర్కొన్నారు.

Chandra Babu Naidu Birthday : చంద్రబాబుకు బర్త్‪డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి..!!

వీడియోలో ఒక వ్యక్తికి చెందిన ఆస్తులు పార్టీకి చెందినవిగా చూపించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఆర్‌ఎస్ భారతి లీగల్ నోటీసు ద్వారా బీజేపీకి అందిన రూ.5,270 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కూడా ప్రశ్నించారు. కాగా దీనిపై అన్నామలై స్పందిస్తూ తాను సోషల్ మీడియా నుంచి వీడియోను తొలగించబోనని, అన్ని చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. బీజీఆర్ సంబంధిత కుంభకోణాన్ని బయటపెట్టినందుకు రూ.500 కోట్లు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ దుబాయ్ పర్యటనకు రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు డీఎంకే రూ.500 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరిందని కే అన్నామలై తెలిపారు.