Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. రాహుల్ పిటిషన్ తిరస్కరణ

పరువున‌ష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సషెన్స్ కోర్టులో చుక్కెదురైంది. రాహుల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. రాహుల్ పిటిషన్ తిరస్కరణ

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో రాహుల్ పిటీషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. 2019లో కర్ణాటకలో మోదీ ఇంటిపేరు గల వారిపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పరువు నష్టం కేసుకు సంబంధించి గత నెలలో సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్‌కు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. తీర్పుపై సవాల్ చేసుకొనేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఆ తరువాత రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియేట్ అనర్హత వేటు పడింది. లోక్‌సభ నుంచి ఆయన్ను డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ రాహుల్ సూరత్ సెషన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

Rahul Gandhi: సూరత్ కోర్టుకు బయల్దేరిన రాహుల్.. తోడుగా ప్రియాంక, కాంగ్రెస్ సీఎంలు

రాహుల్ అపీలుపై ఇరు పక్షాల వాదనలను ఏప్రిల్ 13న కోర్టు స్వీకరించింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గురువారం రాహుల్ పిటీషన్‌పై సూరత్ సెషన్ కోర్టు తీర్పు ఇచ్చింది. రాహుల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ట్రయల్ కోర్టు, సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుందనేది ఉత్కంఠభరితంగా మారింది. మరోవైపు రాహుల్ గాంధీకి ట్రయల్ కోర్టు విధించిన గడువు ఈనెల 23తో ముగియనుంది.

Rahul Gandhi: కులగణన మీద మొదటిసారి మాట్లాడిన రాహుల్ గాంధీ.. యూపీఏ డాటా విడుదల చేయాలంటూ మోదీకి డిమాండ్

సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ అపీలును అనుమతించినట్లయితే, ఆయనకు విధించిన శిక్ష, దోషిత్వ తీర్పును సస్పెండ్ చేసిఉంటే, ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ జరిగి ఉండేది.