Rahul Gandhi: సూరత్ కోర్టుకు బయల్దేరిన రాహుల్.. తోడుగా ప్రియాంక, కాంగ్రెస్ సీఎంలు

కోర్టు తీర్పు అనంతరం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన నిరసనలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉందని, తమ ఐక్యతను చూపిస్తామని అన్నారు. తమది సత్యాగ్రహమని, దేశాన్ని కాపాడే తీరని గెహ్లాట్ అన్నారు.

Rahul Gandhi: సూరత్ కోర్టుకు బయల్దేరిన రాహుల్.. తోడుగా ప్రియాంక, కాంగ్రెస్ సీఎంలు

Rahul gandi and Priyanka gandhi

Rahul Gandhi: మోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ విషయమై ఆయన సోమవారం సూరత్ కోర్టు ముందు హాజరయ్యేందుకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి బయల్దేరిన రాహుల్ గాంధీ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నరు. ఇక సూరత్‭కు రాహుల్ రాగానే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, సుఖ్వీందర్ సింగ్ సుఖులు మద్దతుగా రాహుల్ వెంట ఉండనున్నారు.

Bihar : బుజ్జగింపులు పనిచేయవ్ .. అందుకే మేం అధికారంలోకి వస్తే వాళ్లను తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా హెచ్చరిక

కాగా, కోర్టు తీర్పు అనంతరం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన నిరసనలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉందని, తమ ఐక్యతను చూపిస్తామని అన్నారు. తమది సత్యాగ్రహమని, దేశాన్ని కాపాడే తీరని గెహ్లాట్ అన్నారు.

PM Modi-CM Stalin : టార్గెట్ మోదీ .. 21 పార్టీల నేతలతో ఢిల్లీలో సీఎం స్టాలిన్ సమావేశం..

సూరత్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ సవాల్ చేయనున్నారు. సూరత్ కోర్టు తీర్పుతో పాటు, అతని లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కూడా మధ్యంతర స్టే కోరనున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్ఎస్ చీమ వాదనలు వినిపించనున్నారు.