PM Modi-CM Stalin : టార్గెట్ మోదీ .. 21 పార్టీల నేతలతో ఢిల్లీలో సీఎం స్టాలిన్ సమావేశం..

ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ తలోదారి నడుస్తున్న సమయాన డీఎంకె అధినేత స్టాలిన్ ప్రతిపక్ష కూటమిని ఒక్క దగ్గరికి చేర్చేలా ఓ ప్రయత్నం చేస్తున్నారు . బీజేపీ వ్యతిరేకపార్టీలన్నీ ఏకతాటిపైకి తేవాలని కంకణం కట్టుకున్నారు. ఓ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై చర్చించేందుకు, అసలు ఆ అవకాశం ఉందా లేదా అన్నది తేల్చేందుకు 21 రాజకీయ పార్టీల నేతలతో దేశరాజధానిలో సమావేశమవుతున్నారు.

PM Modi-CM Stalin : టార్గెట్ మోదీ .. 21 పార్టీల నేతలతో ఢిల్లీలో సీఎం స్టాలిన్ సమావేశం..

Tamil Nadu CM Stalin 21 party meeting In Delhi

PM Modi-CM Stalin : దేశంలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలయింది. సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏడాది కూడా సమయం లేదు. అందుకే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకె అధినేత స్టాలిన్ 21 పార్టీల సమావేశం ఏర్పాటుచేశారు. టార్గెట్ మోదీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలను సమావేశంలో చర్చించనున్నారు.

ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ తలోదారి నడుస్తున్న సమయాన డీఎంకె అధినేత స్టాలిన్ ప్రతిపక్ష కూటమిని ఒక్క దగ్గరికి చేర్చేలా ఓ ప్రయత్నం చేస్తున్నారు . బీజేపీ వ్యతిరేకపార్టీలన్నీ ఏకతాటిపైకి తేవాలని కంకణం కట్టుకున్నారు. ఓ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై చర్చించేందుకు, అసలు ఆ అవకాశం ఉందా లేదా అన్నది తేల్చేందుకు 21 రాజకీయ పార్టీల నేతలతో దేశరాజధానిలో సమావేశమవుతున్నారు. రాజకీయ పార్టీలతో పాటు సామాజిక కార్యకర్తలు, పౌర సంఘాలకు సమావేశంలో అభిప్రాయాలు వినిపించేందుకు అవకాశం కల్పించారు. ఈ సమావేశం ఉద్దేశం ఫలించి విస్తృత చర్చలు తర్వాతయినా….జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడితే…దేశ రాజకీయాల్లో అదో పెద్ద మలుపవుతుంది. అయితే స్టాలిన్ కూడా అన్ని పార్టీలనూ కలుపుకుపోవడం లేదు. బీజేపీయేతర పార్టీల్లో చాలావాటికి ఆహ్వానాలు అందలేదు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలతో పాటు శివసేన, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఇందులో ఉన్నాయి. మరి ఈ పార్టీలు బీజేపీకి దగ్గరగా ఉంటాయా, ప్రత్యామ్నాయ కూటమిలో భాగమవుతాయా..లేక తటస్ఠంగా ఉంటాయా అన్నది తేలాల్సి ఉంది.

Bihar : బుజ్జగింపులు పనిచేయవ్ .. అందుకే మేం అధికారంలోకి వస్తే వాళ్లను తల్లకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా హెచ్చరిక

దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో గతంలో ఏపీ నేతల పాత్ర కీలకంగా ఉండేది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌లో తెలుగు రాష్ట్రాల నేతలు చక్రం తిప్పారు. అయితే ఇప్పుడు ఒక వేళ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాక ప్రతిపక్షాల నేతృత్వంలో ఫ్రంట్ ఏర్పడితే…అసలు తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యమే జాతీయ రాజకీయాల్లో కనిపించదు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే…బీఆర్‌ఎస్‌ను బీజేపీకి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అది సుదీర్ఘకాలంలో నెరవేరే అవకాశముందేమో కానీ.. ఈ ఏడాదికాలంలో సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బీఆఎస్‌ అధినేతగా కేసీఆర్ ముందున్న లక్ష్యం మిగిలిన జాతీయ, ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవడం. అయితే బీఆర్‌ఎస్‌కు బీజేపీతో ఎంత శత్రుత్వముందో..నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్‌తోనూ అంతే శత్రుత్వముంది. ఇప్పుడు రెండు పార్టీల మధ్య వైరం అంత లేనప్పటికీ..తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా..బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జాతీయస్థాయిలోనూ ఓ కూటమిలో భాగస్వామ్యం కాలేవు. ఇక కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించి…ఆయన నేతృత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి ఎవరొస్తారనేదానిపై స్పష్టత లేదు. కుమారస్వామి, నితీశ్‌కుమార్, మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ వంటివారితో కేసీఆర్‌కు సత్సంబంధాలున్నాయి. కానీ..ఆ సంబంధాలు..కేసీఆర్ నాయకత్వాన్ని అంగకీరించే స్థాయిలో ఉన్నాయా అనేది ప్రశ్నార్థకమే.. బీఆర్ఎస్ ఆవిర్భావానికి కుమారస్వామి హాజరవడంతో..రెండుపార్టీలు పొత్తుపెట్టుకుంటాయని, కలిసి పనిచేస్తాయని భావించారు. కానీ అసలు కర్ణాటక ఎన్నికల్లోనే పోటీచేయబోమని బీఆర్ఎస్ ప్రకటించింది. కాబట్టి..బీఆర్‌ఎస్, జేడీఎస్ మిత్రపక్షాలే అయిన్పటికీ….త్యాగాలకు సిద్ధంగా లేవు. స్టాలిన్ సమావేశానికి బీఆర్‌ఎస్‌కు ఆహ్వానం అందింది. అయితే కేసీఆర్ హాజరుకావడం లేదు. ఎంపీ కెకె హాజరవుతారు. జేడీఎస్‌కు అసలు స్టాలిన్ నుంచి ఆహ్వానమే లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో అసలు వైసీపీ, టీడీపీకి జాతీయ లక్ష్యాలు ఉన్నట్టే కనిపించడం లేదు. ఏపీలో అధికారం నిలబెట్టుకోవడానికి వైసీపీ..మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నాయి. జాతీయరాజకీయాలను ఈ రెండు పార్టీలు అస్సలు పట్టించుకోవడం లేదు. నిజానికి అసలు ఈ రెండు పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలా..శత్రువులా అన్నదే స్పష్టంగా చెప్పలేం. వైసీపీ ఎన్డీఏలోకానీ, కేంద్ర మంత్రివర్గంలో కానీ భాగస్వామ్యంగా లేదు. కానీ బిల్లులు, ఇతరత్రా సమయాల్లో బీజేపీకి కావాల్సిన మద్దతు అంతా ఇస్తోంది. రెండు పార్టీల మధ్య మంచి స్నేహం ఉందన్నది అందరికీ అర్ధమయ్యేసంగతి. అందుకే బీజేపీ వ్యతిరేక కూటమిలో వైసీపీ భాగం కాలేదు. టీడీపీది దాదాపుగా ఇదే పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ తర్వాత వైదొలిగింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దగ్గరయింది. కానీ ఇప్పుడు రెండు పార్టీలకు సమానదూరం పాటిస్తోంది. మద్దతు అవసరమైన సమయాల్లో బీజేపీకి అండగా ఉంటుంది. టీడీపీ, బీజేపీ మధ్య శత్రుత్వం లేదు. అలాగనీ స్నేహమూ లేదు. అందుకే జాతీయ రాజకీయాల్లో భారీగా గుర్తింపు, పరిచయాలున్నప్పటికీ..స్టాలిన్ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు.

Himanta Biswa Sarma: “కేజ్రీవాల్ కు అంత దమ్ముందా?”.. అంటూ అసోం సీఎం హిమంత రిప్లై

మొత్తం 21 పార్టీలకు స్టాలిన్ ఆహ్వానం అందించారు. ప్రతి ఒక్కరికీ ప్రతీది నినాదంతో భావసారూప్యం గల రాజకీయపార్టీలను ఆహ్వానించారు. రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి,సీపీఐ నేత డి.రాజా, సమాజ్‌వాదీపార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వంటివారికి ఆహ్వానాలు అందాయి. tmc, ఆప్, ఎండీఎంకె పార్టీల నేతలు సమావేశానికి హాజరవుతారు. తమిళనాడులో తమ ప్రత్యర్థి డీఎంకెను స్టాలిన్ ఆహ్వానించలేదు.

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య ప్రారంభోపన్యాసం చేస్తారు. అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వీరేంద్రసింగ్‌ యాదవ్‌ ముగింపు ఉపన్యాసం చేస్తారు. దిల్లీ వర్శిటీ ప్రొఫెసర్లు లక్ష్మణ్‌యాదవ్‌, సూరజ్‌ మండల్‌, రతన్‌లాల్‌లూ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వినిపిస్తారు.