Bihar : బుజ్జగింపులు పనిచేయవ్ .. అందుకే మేం అధికారంలోకి వస్తే వాళ్లను తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా హెచ్చరిక

మంచిగా ఉండండీ అంటూ అల్లర్లరు పాల్పడేవారు ఉంటారా? అందుకే బీహర్ లో మేం అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడేవారిని తల్లక్రిందులుగా వేలాడదీస్తాం అంటూ కేంద్ర హోమ్ మంత్రి..బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bihar :  బుజ్జగింపులు పనిచేయవ్ .. అందుకే మేం అధికారంలోకి వస్తే వాళ్లను తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా హెచ్చరిక

Amit Shah In Bihar

Bihar :  మంచిగా ఉండండీ అంటూ అల్లర్లరు పాల్పడేవారు ఉంటారా? అందుకే బీహర్ లో మేం (BJP) అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడేవారిని తల్లక్రిందులుగా వేలాడదీస్తాం అంటూ కేంద్ర హోమ్ మంత్రి..బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నవాడా జిల్లాలోని హిసువాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న షా మాట్లాడుతు..బీహార్ లోని నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీహార్ లో పలు జిల్లాల్లో శ్రీరామనవమి వేడుల్లో అల్లర్లు తలెత్తాయి. అవి కొనసాగుతునే ఉన్నాయి. ఈ ఘటనపై అమిత్ షా మండిపడ్డారు.

సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ అల్లర్లను అణచలేకపోతున్నారని అల్లరిమూకలను బుజ్జగిస్తున్నారని కానీ బుజ్జగింపు రాజకీయాలు పనిచేయవ్..బీహార్ లో మేము అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడేవారిని తల్లక్రిందులుగా వేలాడదీస్తాం అంటూ వ్యాఖ్యానించారు. 2024లో బీహార్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వచ్చి తీరుతుందని నితీష్ కుమార్ ఓటమి ఖాయం అంటూ జోస్యం చెప్పారు. తాము మొత్తం 40 లోక్ సభ స్థానాలను గెలుచుకుని తీరుతామన్నారు. నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కాబట్టి ప్రధాని కావాలనే నితీశ్ కుమార్ ఆశలు నెరవేరవు అని అన్నారు.

‘‘అశోకచక్రవర్తి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నేను సాసారామ్‌ వెళ్లాలి. కానీ అక్కడ మనుషులు చనిపోతున్నారు. తుపాకులు మోగుతున్నాయి. అందుకే వెళ్లలేకపోయా. ఇందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నా, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీసి సరిచేస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీతీశ్‌కుమార్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతి, అరాచకాలకు మారుపేరైన ఈ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అన్నారు. బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలనూ తామే గెలుచుకుంటామని చెప్పారు.

PM Modi-CM Stalin : టార్గెట్ మోదీ .. 21 పార్టీల నేతలతో ఢిల్లీలో సీఎం స్టాలిన్ సమావేశం..

లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ను బిహార్‌ సీఎంగా చూడాలనుకుంటున్నారని..నీతీశ్‌ కూడా ప్రధాని అవుతానన్న కలలు కంటున్నారని ఈ రెండూ నెరవేరవని ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో బీహార్ లో అధికారం చేపట్టేది బీజేపీయేనని ధీమా వ్యక్తంచేశారు.

‘‘నీతీశ్‌ దేశ ప్రధాని అయితే బీహార్ కు తన కుమారుడు సీఎం అవుతాడని లాలూ కలలు కంటున్నారని అది నెరవేరేదేలేదన్నారు షా. ఈ రెండూ కోరికలు ఎప్పటికి నెరవేవని అన్నరాు. ఎందుకంటే నితీశ్ కుమార్ కూర్చోవటానికి దేశ ప్రధాని పదవి ఖాళీగా లేదు..ఆ స్థానంలో మోదీయే మూడోసారి ప్రధాని అవుతారు..ఇదే ప్రజలు కోరుకుంటున్నారు అని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు.

జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ ఆర్టికల్‌ 370ని రద్దు చేయగా..లాలూ ప్రసాద్‌, నితీశ్‌ కుమార్‌లు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ఇటువంటి బుజ్జగింపు రాజకీయాలు పనిచేయవని ముఖ్యంగా బీహార్ లో అస్సలు పనిచేయవని అందుకే తాము బీహార్ లో అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడేవారిని తల్లక్రిందులుగా వేలాడదీసి తగిన బుద్ధి చెబుతామన్నారు షా.

బీహార్ లో చెలరేగుతున్న హింసాత్మక ధోరణలు త్వరలోనే సాధారణ స్థితికి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. బీహార్ లో శాంతి భద్రతలపై బీజేపీ ఆందోళన వ్యక్తంచేస్తోందని చేతకాని ప్రభుత్వం వల్లకానిది బీజేపీ అధికారంలోకి వస్తే చేసి చూపిస్తుందని అన్నారు షా.