Secunderabad Fire Accident : సికింద్రాబాద్ పాలికాబజార్ లో భారీ అగ్నిప్రమాదం
క్రమంగా మంటలు షాప్ మొత్తానికి విస్తరించడటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Secunderabad Fire
Huge Fire Accident : హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనేవున్నాయి. ఒక ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంటుంది. తాజాగా సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పాలికాబజార్ లోని ఓ బట్టల షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్రమంగా మంటలు షాప్ మొత్తానికి విస్తరించడటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
TSRTC Bus Fire Accident : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం
అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ ఆయుర్వేదిక్ దుకాణం నుంచి మంటలు వ్యాపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.