Telangana Investments : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల సునామీ.. 3 రోజుల్లోనే 1.32 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఒప్పందాలు

ఈసారి దానికి మించి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో అడుగుపెట్టింది.

Telangana Investments : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ పారింది. మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో లక్ష 32వేల కోట్ల రూపాయల ఒప్పందాలను పది సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 60వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. సన్ పెట్రో కెమికల్స్ 45వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది.

దీంతోపాటు ఇన్ఫోసిస్, అమెజాన్.. తెలంగాణ సర్కార్ తో భారీ ఒప్పందం చేసుకున్నాయి. హైదరాబాద్ పోచారం ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. ఇటు అమెజాన్ 60వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అమెజాన్ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం భూమి కేటాయించేందుకు రేవంత్ సర్కార్ అంగీకారం తెలిపింది.

క్రితం సారి దావోస్ ద్వారా 40వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి దానికి మించి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో అడుగుపెట్టింది. అంతేకాదు చరిత్ర సృష్టించిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటివరకు దావోస్ చరిత్రలోనే ఇది హిస్టరీ బ్రేక్ గా ఉండబోతోంది.

Also Read : తెలంగాణ మహిళా కమిషన్ దూకుడు.. సమస్య ఎక్కడున్నా వాలిపోతున్న నేరెళ్ల శారద..

ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి చూసుకుంటే ఇదే హయ్యస్ట్ ఇన్వెస్ట్ మెంట్. గత ఏడాది దావోస్ వేదికగా వచ్చిన 40వేల కోట్ల పెట్టుబడులే ఇప్పటివరకు అత్యధికం. ఇప్పుడు దానికి మించి పెట్టుబడుల వరద పారింది. మరో రెండు మూడు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు లక్ష 32వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ పెట్టుబడులతో దాదాపు 46వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఇదంతా కూడా ప్రత్యక్షంగా లభించే ఉపాధి. ఇక పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

తెలంగాణకు పెట్టుబడుల సునామీ..
* దావోస్ వేదికగా తెలంగాణ రికార్డ్
* తెలంగాణకు పెట్టుబడుల వరద
* నిన్న ఒక్కరోజే రూ.56,300 కోట్ల పెట్టుబడుల సమీకరణ
* ఇవాళ ఇన్ఫోసిస్, అమెజాన్ తో భారీ ఒప్పందాలు
* హైదరాబాద్ పోచారం ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం

* ఫేజ్-1లో రూ.750 కోట్లతో కొత్త ఐటీ భవనాల నిర్మాణం
* రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్
* రూ.46వేల 500 కోట్లతో సన్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్ మెంట్
* పంప్డ్ స్టోరేజ్, సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న సన్ పెట్రో
* కంట్రోల్ ఎస్ రూ.10వేల కోట్లు

* జేఎస్ డబ్ల్యూ రూ.800 కోట్ల పెట్టుబడులు
* యువతకు 10వేల 800 ఉద్యోగాలు లభించే ఛాన్స్
* మెఘా ఇంజినీరింగ్ తో మూడు ఒప్పందాలు
* రాష్ట్రంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న స్కైరూట్

 

Also Read : ఉన్నట్లుండి ఈటల రాజేందర్ దూకుడు పెంచడంలో వ్యూహమేంటి? చేయి చేసుకోవడానికి కారణం అదేనా?