Gossip Garage : తెలంగాణ మహిళా కమిషన్ దూకుడు.. సమస్య ఎక్కడున్నా వాలిపోతున్న నేరెళ్ల శారద..

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినా..మెయిన్ స్ట్రీమ్‌ మీడియాలో వార్త వచ్చినా క్విక్‌ రియాక్షన్‌ ఇస్తోంది తెలంగాణ మహిళా కమిషన్‌. మహిళల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తోంది.

Gossip Garage : తెలంగాణ మహిళా కమిషన్ దూకుడు.. సమస్య ఎక్కడున్నా వాలిపోతున్న నేరెళ్ల శారద..

Updated On : January 23, 2025 / 9:57 AM IST

Gossip Garage : అడ్డగోలు కామెంట్స్..టంగ్‌ స్లిప్‌ అయి మహిళలపై వ్యాఖ్యలు చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు. మొన్నటి వరకు పెద్ద ఇష్యూ అయితే తప్ప పెద్దగా స్పందించని పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినా..మెయిన్ స్ట్రీమ్‌ మీడియాలో వార్త వచ్చినా క్విక్‌ రియాక్షన్‌ ఇస్తోంది తెలంగాణ మహిళా కమిషన్‌. మహిళల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకంపై కామెంట్స్ చేశారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు నోటీసులు ఇచ్చి చర్చకు దారి తీసింది మహిళా కమిషన్. ఏకంగా కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీస్‌కు వెళ్లి మరీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

నాగచైతన్య, శోభితా ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా వాళ్లిద్దరు పెండ్లి చేసుకుంటే విడిపోతారంటూ జోతిష్యం చెప్పిన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టుకెళ్లారు వేణుస్వామి. అయితే మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పడంతో..ఉమెన్ కమిషన్ ఆఫీస్‌కు వెళ్లక తప్పలేదు. చివరకు లిఖిత పూర్వకంగా సారీ చెప్పారు వేణుస్వామి.

Also Read : ‘డిప్యూటీ సీఎం’ ప్రచారంపై నారా లోకేశ్ రియాక్షన్.. నా టార్గెట్ ఇదే.. అసలు విషయం రివీల్

తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక లేటెస్ట్‌గా డైరెక్టర్ త్రినాథ్‌ రావు..నటి అన్షును ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం లేపాయి. వెంటనే మహిళా కమిషన్‌ సీరియస్‌గా రియాక్ట్ అయింది. కేసు పెడతామని కూడా వార్నింగ్‌ ఇచ్చింది. దాంతో ఎక్కడ తన మెడకు ఉచ్చు బిగుసుకుంటుందోనన్న భయంతో క్షమించండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు డైరెక్టర్‌ త్రినాథ్‌ రావు. నటి అన్షుకు, తన వ్యాఖ్యలతో బాధపడ్డ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాడు.

ఈ ఇష్యూసే కాదు..గురుకుల హాస్టల్స్‌, కార్పొరేట్‌ కాలేజీల్లో బాలికలు, యువతులు పడుతున్న ఇబ్బందులపై కూడా ఉమెన్ కమిషన్‌ ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్తుంది. డైరెక్టుగా హాస్టళ్లు, కాలేజీలకు వెళ్లడం వాస్తవ పరిస్థితులను పరిశీలించడం..అక్కడున్న అధికారులను పిలిచి వార్నింగ్‌ ఇస్తూ యాక్షన్‌ ఏంటో చూపిస్తోంది మహిళా కమిషన్. ఈ మధ్యే ఓ కాలేజీలో విద్యార్థినుల వీడియోలు తీశారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో సదరు కాలేజీకి వెళ్లి.. బాత్రూమ్‌ల దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని ఆరా తీసి..కాలేజీ అధికారులను నిలదీశారు మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ నేరెళ్ల శారద.

ఇలా ప్రతీ ఘటనపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ మహిళా కమిషన్‌ ఉన్నది పేరుకు కాదు..మగువలను తక్కువ చేసి మాట్లాడినా.. మహిళలకు సమస్య వచ్చినా డైరెక్టుగా ఫీల్డ్‌లోకి దిగుతామంటూ వార్నింగ్ ఇస్తోంది. అయితే సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే పవర్‌ ఫుల్‌గా పని చేస్తున్నామని..ఏదైనా సమస్య తమ దృష్టికి వస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నామని చెబుతున్నారు మహిళా కమిషన్‌ సభ్యులు.

 

Also Read : జీవీఎల్‌ నరసింహారావు హడావుడి ఎందుకు తగ్గినట్లు?