సలామ్ గాంధీ : వైద్య సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నారు

  • Publish Date - September 4, 2020 / 06:43 AM IST

కరోనా రోగులకు గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్విరామంగా ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. కరోనా సోకిన గర్భిణులు మొదలుకొని.. చిన్నారులకూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారికి అన్నీ తామై కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇప్పటి వరకు 600 మంది గర్భిణులకు వైద్యం అందించిన గాంధీ వైద్యులు..ఎంతమంది వచ్చినా తాము సిద్ధమని చెబుతున్నారు.



కరోనాకు ట్రీట్‌మెంట్‌ అందిస్తోన్న గాంధీ ఆస్పత్రి ఎన్నో సవాళ్లను అధిగమిస్తోంది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులకు కరోనా వైద్యం అందించడమంటే మాటలు కాదు. వీరిలో వ్యాధినిరోధక శక్తి తక్కువ. అలాంటి వారిని కాపాడటమంటే వైద్యులకు కత్తిమీద సామే. అయినా గాంధీ వైద్యులు ఇలాంటి సవాళ్లను కూడా స్వీకరించారు.
https://10tv.in/steroids-improve-survival-rate-of-critically-ill-covid-19/
ఇప్పటికే కరోనా సోకిన నిండు గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు.. వారికి పుట్టిన శిశువులను కూడా కాపాడుతూ తల్లీ బిడ్డలను ఇంటికి క్షేమంగా పంపుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు దాదాపు 600 మందికి పైగా కరోనాతో గాంధీలో వైద్యం కోసం చేరారు. వీరిలో 320 మందికి గాంధీలోనే డెలివరీ చేశారు.



వీరందరికీ మెరుగైన వైద్యం అందించి.. తల్లీబిడ్డలను కాపాడి.. క్షేమంగా ఇంటికి చేర్చారు. కోవిడ్ సోకిన గర్భిణులకు వైద్యం చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరించినా కూడా… గాంధీ ఆస్పత్రి మాత్రం వారిని అక్కున చేర్చుకుంటోంది. వారిని కంటికి రెప్పలా కాపాడుతూ…. కాన్పులు చేస్తూ తల్లీబిడ్డలను కోవిడ్‌ బారి నుంచి కాపాడుతున్నారు.

గాంధీ అస్పత్రికి వచ్చిన గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి… ఆ తర్వాత వారికి డెలివరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో కొంత‌మంది నార్మల్‌ డెలివరీతో ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి చేరుకుంటే.. మ‌రికొంత మంది సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లతో కొన్ని రోజుల పాటు గాంధీలో ట్రీట్మెంట్‌లో ఉంటున్నారు. కాన్పు చేసిన తర్వాత పుట్టిన శిశువుకు వైరస్‌గానీ.. లేదా మరేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్న అంశాలను వైద్యులు పరిశీలిస్తారు.



వైరస్‌ అటాక్‌ కాకుంటే ఆ శిశువులను ఐసీయూకు తరలిస్తారు. ఒకవేళ ఏ శిశువుకైనా కోవిడ్‌ పాజిటివ్‌ వస్తే.. వారిని కంటికి రెప్పలా వైద్యులే కాపాడుతున్నారు. శిశువుల ఆలనా పాలనా కూడా ఆస్పత్రి సిబ్బందే చూస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 12ఏళ్ల చిన్నారుల వరకు పీడియాట్రిక్‌ వార్డ్‌లో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుతూ వారి ప్రాణాలను రక్షిస్తున్నారు. దీంతో గాంధీ వైద్యులపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.