Gay Couple: తెలంగాణలో తొలి గే వివాహం.. 8ఏళ్ల ప్రేమ తర్వాత
తెలంగాణలో తొలిసారి గే వివాహం జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించుకుని ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సుప్రియో, అభయ్‌ల వివాహానికి....

Gay Couple
Gay Couple: తెలంగాణలో తొలిసారి గే వివాహం జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించుకుని ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సుప్రియో, అభయ్‌ల వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. భారతదేశంలో స్వలింగసంపర్కం చట్టబద్ధత కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను సద్వినియోగపరుచుకున్నారు.
విదేశాల్లో తరహాలోనే ఇండియాలోనూ గే వివాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్కృతి మెల్లగా తెలుగు రాష్ట్రాలకు వ్యాపించి తెలంగాణాలో తొలి స్వలింగ సంపర్క వివాహం జరిగింది.
హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా సుప్రియో పనిచేస్తుంటే, అభయ్ మాత్రం సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా కొనసాగుతున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. వీరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమించుకోవాలని నిర్ణయం తీసుకుని, తమ పెద్దలను ఒప్పించారు.
…………………………….. : ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన కోవిడ్ కేసులు