హైదరాబాద్‌లో కాంపౌండర్‌కు రెండోసారి కరోనా పాజిటివ్..ఇదెలా సాధ్యం?

  • Published By: madhu ,Published On : July 28, 2020 / 09:05 AM IST
హైదరాబాద్‌లో కాంపౌండర్‌కు రెండోసారి కరోనా పాజిటివ్..ఇదెలా సాధ్యం?

Updated On : July 28, 2020 / 12:49 PM IST

హైదరాబాద్ లో Male Nurse కు రెండోసారి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఒక్కసారి వైరస్ వచ్చి…తగ్గిన అనంతరం..రెండోసారి..రాదని అనుకున్నారు..కానీ ప్రస్తుతం Male urse కు మరోసారి వైరస్ సోకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కోలుకున్న రోగి మరోసారి వైరస్ బారిన పడడం ఇది రెండో కేసు.

30 సంవత్సరాలున్న Male Nurse 2020. జూన్ 15వ తేదీన నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. చికిత్స అనంతరం జూన్ 26వ తేదీన డిశ్చార్జ్ చేశారు. అనంతరం తిరిగి విధుల్లో జాయిన్ అయ్యాడు. కానీ వారం గడిచిన తర్వాత..కొద్దిగా దగ్గు, జలుబు సోకింది. జులై 20వ తేదీన మరోసారి పరీక్షలు నిర్వహించుకున్నాడు.

పాజిటవ్ అని తేలడంతో హతాశుడయ్యాడు. నాలుగు రోజుల అనంతరం భార్య, రెండున్నర సంవత్సరాల కుమర్త, అతని తల్లి, అదే ఆసుపత్రిలో ఓ నర్సుకు వైరస్ సోకింది. కానీ మొదటిసారి కన్నా…రెండోసారి అనుభవం దారుణంగా ఉందన్నారు. జ్వరం, శరీర నొప్పులున్నాయని, ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు.

తన కుటుంబంలోని మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ వివిధ రూపాల్లోకి వెళుతోందని, దీనిపై అధ్యయనం ఇంకా కొనసాగుతోందని అపోలో ఆసుపత్రి సీనియర్ వైద్యుడు వెల్లడించారు.