Hyderabad Traffic : హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్, ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic : అఫ్జల్ గంజ్ వైపు నుండి వచ్చే వాహనాలను ఎస్ఎ మసీద్ నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ వైపు మల్లింపబడుతుంది. రంగమహల్ నుండి వచ్చే ట్రాఫిక్ ను సీబీఎస్ వైపు మళ్ళించబడుతుంది.

Hyderabad Traffic (Photo : Google)
Hyderabad Traffic : హనుమాన్ శోభాయాత్ర సవ్యంగా సాగేందుకు హైదరాబాద్ నగరవాసులు సహకరించాలని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఉదయం 11 గంటలకు గౌలిగూడలోని రామ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు.
* అఫ్జల్ గంజ్ వైపు నుండి వచ్చే వాహనాలను ఎస్ఎ మసీద్ నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ వైపు మల్లింపబడుతుంది.
* రంగమహల్ నుండి వచ్చే ట్రాఫిక్ ను సీబీఎస్ వైపు మళ్ళించబడుతుంది.
* మధ్యాహ్నం 12:30 గంటలకు యాత్ర కోటి ఆంధ్ర బ్యాంక్ సర్కిల్ కు ఉంటుంది.
* ఆ సమయంలో కోటి వైపు వచ్చే వాహనాలను చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద డైవర్ట్ చేసి నింబోలిఅడ్డ రంగమహల్ వైపు మళ్ళించబడును.
* కాచిగూడ వైపు నుండి వచ్చే ట్రాఫిక్ ను లింగంపల్లి ఎక్స్ రోడ్ నుండి పోస్టాఫీస్ రోడ్ చప్పల్ బజార్ వైపు మళ్లించబడుతుంది.
* నారాయణగూడ షాలిమార్ థియేటర్ వైపు వాహనాలు అనుమతించబడవు.
* ఆ ట్రాఫిక్ ను షాలిమార్ మీదుగా ఈడెన్ గార్డెన్ వైపు మళ్ళించబడును.
* శోభాయాత్ర సమయంలో నారాయణగూడ ఫ్లైఓవర్ తెరిచే ఉంటుంది. వాహనదారులు గమనించగలరు.
* అశోక్ నగర్ లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుంది.
* శోభాయాత్ర సందర్భంగా నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.
* గతంలో ఎక్కువ హైట్ లో డీజేలు పెట్టడం వల్ల అవి కూడా ట్రాఫిక్ జామ్ కు కారణం అయ్యాయి.
* ఈసారి నిర్వహకులకు నిర్ణీత ఎత్తులో డీజేలు అమర్చుకోవాలని సూచన చేశారు.
* ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, బైబిల్ హౌస్.. శోభాయాత్ర సమయంలో ఈ మూడు ప్రాంతాలు చాలా కీలకం.
* బైబిల్ హౌస్ మీదుగా కవాడీ గూడ వెళ్లే వాహనాలను శోభాయాత్ర రోజు అనుమతించరు.
* ఆ ట్రాఫిక్ ను కర్బలా మైదాన్ గుండా మహంకాళి ట్రాఫిక్ మళ్లించబడుతుంది.
* హనుమాన్ శోభాయాత్ర రాత్రి 8 గంటల ప్రాంతంలో తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం చేరుకుంటుందని భావన.
* శోభాయాత్రలో ప్రత్యక్షంగా 750 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
* ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా పనిచేస్తారు.