Rain Alert in Hyderabad: వరద నీటిలో కొట్టుకుపోయిన కారు..ఇద్దరు గల్లంతు..ఒక మృతదేహం లభ్యం..

Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. తెలంగాణలో పడుతున్న వర్షాల్లో పెను విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కార్లు..బైకులే కాదు పెద్ద పెద్ద లారీలు వంటి వాహనాలు కూడా వరదనీటిలో కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం… లష్కర్ గూడ గ్రామంలో సోమవారం (అక్టోబర్ 13,2020) కారులో వెళ్తూండగా వరదనీటి ప్రవాహానికి ఆ కారుడు కొట్టుకుపోయింది. ఆ కారులో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు గల్లంతయ్యారు.
ఆ ఇద్దరు యువకుల్లో ఒకరి మృతదేహం గల్లంతైన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన వ్యక్తిని
వెంకటేష్ గౌడ్‌గా అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే… గల్లంతైన మరో యువకుడు రఘవీందర్ కోసం పోలీసులూ, స్థానికులు గాలిస్తున్నారు.
వెంకటేశ్..రఘువీందర్ కారులో వెళ్తున్న సమయంలో తాము చుట్టూ వరదలో చిక్కుకున్నామనీ…ఎలా బైటపడాలో తెలియటంలేదనీ తెలిసివారికి వీరిద్దరు ఫోన్ చేశారు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మీరుండే చోటికి మేము వచ్చే పరిస్థితి కూడా లేదనీ..దగ్గర్లోని ఏ ఆధారం దొరికితే దాన్ని పట్టుకుని జాగ్రత్తగా ఉండమని తాము అధికారులకు సమాచారం అందిస్తామని చెప్పాడు.
కానీ…ఈచుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్టుగానీ..బండలు వంటివి ఏమీ లేవనీ..తాము మెల్లమెల్లగా వరదలో ముందుకు కొట్టుకుపోతున్నామనీ భయంతో చెప్పుకున్నాడు. అలా వాళ్లు ఫోన్ మాట్లాడుతుండగానే… సిగ్నల్స్ కట్ అయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ కాంటాక్స్ కట్ కాల్స్ కట్ అయ్యాయి. చివరకు వారిద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరి కోసం అధికారులు..స్థానికులు..బంధువులు గాలిస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా..ఆచూకీ తెలియని వ్యక్తి కోసం అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సజీవంగా దొరకాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
కాగా వరదలు ముంచెత్తుతుండగా అధికారులు అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ – 90001 13667, 97046 01866, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్‌ఎంసీ విద్యుత్ శాఖ- 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.