×
Ad

Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు అలర్ట్.. బయటకు రావొద్దు..

Hyderabad Rains : హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది. ఇవాళ రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Hyderabad Rains

Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. నగరాన్ని క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Also Read: Telangana Govt : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. విద్యుత్ శాఖలో 3వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..?

హైదరాబాద్‌లో వర్షం (Hyderabad Rains) కుమ్మేస్తోంది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

గత కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్ నగరంతో పాటు ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఇవాళ సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షం సమయంలో బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో నగరవాసులను హైడ్రా అలర్ట్ చేసింది. అయ్యా ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగిన్ పాయింట్స్‌ను చెక్ చేసుకుని వెళ్లాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఓపెన్ నాలాలకు దూరంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం కానీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హైడ్రా కమిషనర్ నగర వాసులకు సూచించారు.