Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ ఊహించని ట్విస్ట్.. తెరపైకి బొంతు రామ్మోహన్..!
బీజేపీ కీలక నేత, ఎంపీ ధర్మపురి అరవింద్.. బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించడం ఆసక్తి రేపుతోంది.

Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ప్రచార పర్వంలోకి సైతం దిగిపోయారు. మాగంటి గోపినాథ్ సతీమణి సునీత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక నిన్ననే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. నవీన్ యాదవ్ ని తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.
ఇక అభ్యర్థిని ప్రకటించాల్సిన ప్రధాన పార్టీ బీజేపీ ఒక్కటే. బీజేపీ అభ్యర్థులుగా కీర్తి రెడ్డి, దీపక్ రెడ్డి, ఆకుల విజయ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆయనే కాంగ్రెస్ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన బొంతు రామ్మోహన్ పేరుని వ్యూహాత్మకంగా బీజేపీ తెరపైకి తెచ్చింది.
బీజేపీ కీలక నేత, ఎంపీ ధర్మపురి అరవింద్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించడం ఆసక్తి రేపుతోంది. బొంతు రామ్మోహన్ మంచి వ్యక్తి అని, అంతేకాకుండా ఆయనకు ఏబీవీపీ బ్యాక్ గ్రౌండ్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు బొంతు పేరుని సూచించారు.
దీంతో బొంతు రామ్మోహన్ పేరుని బీజేపీ చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిన్నటివరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించలేదు. దాంతో ఆయనను బరిలోకి దింపితే ఫలితం మరోలా ఉంటుంది, కచ్చితంగా గెలిచి తీరుతాం అనే అంచనాకు బీజేపీ వచ్చినట్లు సమాచారం. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇటు ఎంపీ ధర్మపురి అరవింద్, గతంలో రామ్మోహన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న రఘునందన్ రావు.. ఇలాంటి నేతలు అంతా రామ్మోహన్ ను బెస్ట్ ఛాయిస్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టీడీపీ దూరం.. చంద్రబాబు నిర్ణయం వెనుక అసలు కారణం అదేనా?
పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఎన్నికల మేనేజ్ మెంట్ మీటింగ్ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారి, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అరవింద్ సహా పార్టీ పదాధికారులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరుని సూచించిన ఎంపీ అర్వింద్.