Cm Chandrababu: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టీడీపీ దూరం.. అసలు కారణం అదేనా?
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టీవ్‌గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారట.

Cm Chandrababu: జూబ్లీహిల్స్ ఎన్నికలు.. లోకల్ బాడీ పోల్స్ వేళ ఆల్ ఆఫ్ సడెన్‌గా మీటింగ్ పెట్టారు చంద్రబాబు. ఇంకేముంది కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ బరిలో నిలుస్తామని చెబుతారని ఎక్స్‌పెక్ట్ చేశారట లీడర్లు. కాకపోతే చిన్న ట్విస్ట్‌తో తెలంగాణ టీడీపీ లీడర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారట. ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు షాక్ అయ్యారట. బాబు మాత్రం మన టార్గెట్ గ్రేటర్ అని చెప్పుకొచ్చారట. ఆ లోపే టీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని చెప్పారట. జూబ్లీహిల్స్ రేసు నుంచి టీడీపీ ఎందుకు తప్పుకుంది? బీజేపీ కోసమే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారా? ఇంకేమైనా రీజన్ ఉందా?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నాం..ఇలా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం కాదా? ఇదీ టీటీడీపీ నేతల ఆందోళనట. అవును..తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన చంద్రబాబును..వరుసగా ఎన్నికలకు దూరంగా ఉంటే ఎలా అని నేతలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ టీడీపీ నేతలు ప్రస్తానించినా..సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో పోటీకి దూరంగా ఉందామని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీని పునర్ నిర్మించుకుని వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలనాటికైనా రంగంలోకి దిగేందుకు సిద్ధమవ్వాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.
నందమూరి హరికృష్ణ కూతురు, టీటీడీపీ కీలక నేత నందమూరి సుహాసినిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలోకి దింపితే బావుంటుందని తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా..ఆయన అంతగా సుముఖుత వ్యక్తం చేయలేదట. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారట.
బీజేపీకి మద్దతిచ్చే అంశంపై చంద్రబాబు ప్రస్తావన..
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి మద్దతిచ్చే అంశంపైనా తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టీడీపీ మద్దతు కోరుతూ బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, అలాంటి ప్రపోజల్ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై సమావేశంలో చర్చకు వచ్చిందట. పార్టీకి పట్టున్న చోట, పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్న గ్రామాల్లో పోటీకి దిగాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
ఇక వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు టీటీడీపీ నేతలను ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తియిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని మీటింగ్‌లో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు స్టేట్ కమిటీ నియమించాలన్న అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని చెబుతున్నారు.
తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేసినట్లు సీఎం చంద్రబాబుకు నాయకులు వివరించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టీవ్‌గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారట. సమర్థవంతమైన నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానని చంద్రబాబు చెప్పారట. ఈలోపు కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని సూచించారట.
వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసే విధంగా సమాయత్తం కావాలని, ఆ తర్వాత 2028లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీలో కీలకంగా పని చేశారు, చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడు..
అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు టీడీపీ దూరం ఉండటం వెనక స్ట్రాటజీ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అటు ఏపీలో, కేంద్రంలో బీజేపీతో పొత్తులో కొనసాగుతుండటంతో జూబ్లీహిల్స్‌లో పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నారట. బీజేపీ మద్దతు కోరితే అక్కడ ఆ పార్టీకి సహకరించేందుకు కూడా రెడీగా ఉందట టీడీపీ. సేమ్‌టైమ్ టీడీపీ జూబ్లీహిల్స్ బరిలో దిగకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మాగంటి గోపినాథ్ గతంలో టీడీపీలో కీలకంగా పనిచేశారు. చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడు.
ఇప్పుడు మాగంటి సతీమణి అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో..టీడీపీ కూడా బరిలో ఉంటే సెటిలర్ల ఓట్లు చీలిపోతాయన్న అంచనాతో..పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. దీంతో అసలు టీడీపీ మద్దతు ఎవరికన్న దానిపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. మాగంటి కుటుంబానికి మద్దతుగా తమ్ముళ్లు నిలుస్తారా? లేదా మిత్ర ధర్మంతో బీజేపీకి సపోర్టు చేస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
Also Read: బీసీ రిజర్వేషన్లు.. హైకోర్టులో రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్..!