Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు.. హైకోర్టు ఆదేశాలతో ఈసీ కీలక నిర్ణయం..
బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ను నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

Local Body Elections
Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను నిలిపివేంది. బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. దీనికి సంబంధించిన గెజిట్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
కాగా, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ పై కోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పైనా స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం కౌంటర్ల పై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్ కు 2 వారాల గడువు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ను నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ ఇటీవల జీవో నెంబర్ 9ను జారీ చేసింది. దీని ప్రకారమే ఎస్ఈసీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అంతేకాదు ఇవాళ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ సైతం ఇచ్చింది. అయితే జీవో 9 చెల్లదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
Also Read: బీసీ రిజర్వేషన్లు.. హైకోర్టులో రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్..!
హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఎలక్షన్ నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు ఉత్తర్వులు అందడంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గెజిట్ విడుదల చేసింది SEC. గెజిట్ విడుదలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎత్తివేశారు.