Hyderabad Steel Bridge: హైదరాబాద్‌లో రెండో స్టీల్ బ్రిడ్జ్ రెడీ

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గానూ కీలక మార్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగానే పంజాగుట్ట వద్ద స్టీల్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేసింది.

Hyderabad Steel Bridge: హైదరాబాద్‌లో రెండో స్టీల్ బ్రిడ్జ్ రెడీ

Second Steel Bridge

Updated On : July 5, 2021 / 6:58 AM IST

Hyderabad Steel Bridge: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గానూ కీలక మార్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగానే పంజాగుట్ట వద్ద స్టీల్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేసింది. ఎప్పుడూ రద్దీగా కనిపించే పంజాగుట్ట వద్ద ఈ రెడీ అయిన ఈ బ్రిడ్జ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి పంజాగుట్ట వైపుకు ఒక స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయగా ఇది రెండోది.

రోడ్ విస్తరించడంతో పలు బిజీ లొకేషన్లకు లింకింగ్ గా మారింది. ప్రధానంగా సిటీ కమర్షియల్ సెంటర్లను కలిపింది. పర్యావసానంగా ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది. మొదటి బ్రిడ్జ్ లాగే రెండో బ్రిడ్జ్ కూడా స్మూత్ అండ్ స్టడీ కదలికలకు కారణమవుతుందని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.17కోట్లు కేటాయించగా స్థలం కోసమే రూ.6కోట్ల వరకూ ఖర్చు అయింది. మొత్తం బ్రిడ్జ్ పొడవు 140మీటర్లు. అందులో స్టీల్ బ్రిడ్జ్ భాగం 83మీటర్లు కాగా మిగతాది 57మీటర్లు.

ఈ సౌకర్యం నాగర్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ జంక్షన్ వరకూ అందుబాటులో ఉండటంతో ట్రాఫిక్ తగ్గి స్మశాన వాటక ప్రదేశంలో ఇబ్బంది లేకుండా మారింది. ప్రజల సెంటిమెంట్లు దృష్టిలో పెట్టుకుని నిర్మించిన బ్రిడ్జ్.. సమాధుల వద్ద జరిపే ప్రార్థనలకు ఎటువంటి ఆటంకాన్ని కలుగజేయదు.

వీటితో పాటు మరో స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక వేస్తున్నారు. జలగాం వెంగళరావు పార్క్ రోడ్ నుంచి స్మశానం వరకూ దీని నిర్మాణం చేపడతారు. స్థల సమీకరణపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.