Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

ద్విచక్ర వాహనం నుంచి కింద పడిన దుర్గాప్రసాద్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Road accident

Hyderabad – Road Accident: హైదరాబాద్‌లోని మాదాపూర్ లో వాటర్ ట్యాంకర్ ఢీ కొని ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. మాదాపూర్ శిల్పారామం నుంచి ద్విచక్ర వాహనంపై ఫుడ్ డెలివరీ చేసేందుకు దుర్గాప్రసాద్ (40) వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ వాటర్ ట్యాంకర్ వేగంగా వచ్చి దర్గాప్రసాద్ ను ఢీ కొట్టింది.

దీంతో ద్విచక్ర వాహనం నుంచి కింద పడిన దుర్గాప్రసాద్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాటర్ ట్యాంకర్ ను డ్రైవర్ నిర్లక్యంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad : భాగ్యనగరంలో పాములు.. వర్షంలో చూసుకుని వెళ్లండి..