Gas Cylinder Racket: హైదరాబాద్‌లో భారీ గ్యాస్ దందా.. పోలీసుల పక్కా ప్లాన్.. 750 సిలిండర్లు, యంత్రాలు సీజ్
హైదరాబాద్ లో అక్రమంగా మినీ గ్యాస్ సిలిండర్లను (Gas Cylinder Racket)తయారు చేస్తూ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
hyderabad task force police busts illegal mini gas cylinder manufacturing gang
- అక్రమ మినీ సిలిండర్ల గుట్టురట్టు
- నలుగురు నిందితుల అరెస్ట్, సీజింగ్
- అధికారిక డీలర్ల వద్దే కొనుగోలు
Gas Cylinder Racket: హైదరాబాద్ నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మినీ గ్యాస్ సిలిండర్లను తయారు చేస్తూ, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విజయవంతంగా రట్టు చేశారు. గత రెండేళ్లుగా నగరంలో రోజుకు వేయికి పైగా మినీ సిలిండర్లలో గ్యాస్ నింపి విక్రయిస్తున్న ఈ ముఠా సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్‌తో దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Pawan Kalyan: వారి ట్రాప్‌లో పడొద్దు.. వ్యక్తిగత దూషణలు మానుకోండి.. జనసైనికులకు పవన్ హెచ్చరిక
విచారణలో వెలుగుచూసిన తయారీ కేంద్రం:
శంషాబాద్ ఆర్జీఐఏ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద బొలేరో వాహనాన్ని తనిఖీ చేయడంతో ఈ ముఠా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను లోతుగా విచారించగా, రాజాపూర్ గ్రామంలోని ఒక గోదాములో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా సిలిండర్లను(Gas Cylinder Racket) తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ దాడుల్లో మొత్తం 750 మినీ గ్యాస్ సిలిండర్లు, 7 తయారీ యంత్రాలు, ఒక రవాణా వాహనాన్ని సీజ్ చేశారు. బాధ్యులపై ఆర్జీఐఏ, రాజాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాణ్యత లేని సిలిండర్లతో ప్రాణాలకే ముప్పు:
ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పోలీస్ అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, భద్రతా ప్రమాణాలు లేని మినీ సిలిండర్లను వాడటం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను కేవలం లైసెన్స్ ఉన్న అధికారిక డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, ఎక్కడైనా అక్రమంగా తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
