Lockdown Rules Break: మాస్కుల్లేకుండా బైకులపై తిరుగుతున్న యువకులు..ప్రశ్నించిన పోలీసులపై దాడి..తిట్ల దండకం

కరోనా మహమ్మారిని కట్టడి చేయటానికి తెలంగాణాలో ప్రకటించిన లాక్ డౌన్ ప్రశ్నార్థకంగా మారింది. లాక్ డౌన్ సమయం మించిపోయినా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న యువకుల్ని ప్రశ్నించిన పోలీసులపై ఎదురు తిరిగి దాడులకు పాల్పడ్డారు. మాస్కులు పెట్టుకోకుండా...హెల్మెట్ పెట్టుకోకుండా బైకులమీద తిరుగుతున్న యువకుల్ని ప్రశ్నించగా..పోలీసులపైనే దాడికి యత్నించారు.

young mans tried to attack On police : కరోనా మహమ్మారిని కట్టడి చేయటానికి తెలంగాణాలో ప్రకటించిన లాక్ డౌన్ ప్రశ్నార్థకంగా మారింది. లాక్ డౌన్ సడలింపుల సమయం మించిపోయినా జనాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. వారిని ప్రశ్నించిన పోలీసులపై ఎదురు తిరిగి దాడులకు పాల్పడుతున్న ఘటనలో కరోనా అంటే భయంలేదా? లేక బాధ్యత లేనితనమా? అని అనుకోవాల్సి వస్తోంది.

ఈ క్రమంలో నగరంలోని రాజేంద్రనగర్ లోని సులేమాన్ నగర్ లో కొంతమంది యువకులు లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్నారు. లాక్ డౌన్ అమలు చేసే డ్యూటీలో ఉన్న పోలీసులు యువకుల్ని ఆపి ప్రశ్నించగా..వారు పోలీసులపై ఎదురు తిరిగారు. ఏకంగా పోలీసులపై తిట్ల దండకం అందుకున్నారు. దాడికి కూడా యత్నించారు. ఇష్టమొచ్చినట్లుగా తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారు.

లాక్ డౌన్ సమయం మించిపోయింది. మిట్టమధ్యాహ్నాం అయింది. రాజేంద్రనగర్ లోని సులేమాన్ నగర్ ఇమాద్ నగర్ బస్తీలో మంగళవారం (మే 25,2021) కొంతమంది యువకులు బైక్ లపై తిరుగుతున్నారు. పైగా వారెవ్వరూ హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. కనీసం మాస్కు పెట్టుకోలేదు. ఈక్రమంలో పోలీసులు ఓ యువకుడ్ని ఆపి ప్రశ్నించారు.

దానికి ఓ యువకుడు పోలీసులపై రెచ్చిపోయాడు. తిట్లు అందుకున్నాడు. అక్కడితో ఊరుకోకుండా నా బండే ఆపుతావా? అంటూ బండి దిగి రోడ్డుమీద ఉన్న రాయి తీసుకుని పోలీసులపైకి దాడికి యత్నించాడు.ఈ పోలీసుల్ని చితక్కొట్టాలి అంటూ నానా రభసా చేశాడు. మరో యువకుడు బూతులు తిడుతూ పారిపోయాడు.

ట్రెండింగ్ వార్తలు