IAS Transfers : తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎనిమిది మందిని బదిలీ చేస్తూ శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
IAS Officer Transfers in telangana: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎనిమిది మందిని బదిలీ చేస్తూ శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
- బదిలీ అయిన వారి వివరాలు….
- కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవిని షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ అభివృద్ధి శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు.
- కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలను అప్పగించారు.
- విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త ర్యదర్శి ఎస్. హరీశ్ కు రవాణా, ఆర్ అండ్ బి సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
- పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంక.
- హాకా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా చంద్రశేఖర్ రెడ్డి.
- మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి.
- ట్రాన్స్ పోర్ట్ , హౌసింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వికాస్ రాజ్ ను రవాణా, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది.