Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుపై మరో ట్విస్ట్

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తునే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. రోడ్డు రోలర్‌ గుర్తును మొదట శివ కుమార్ పొందిన విషయం తెలిసిందే. అయితే, శివకుమార్ ప్రాధాన్యత గుర్తుగా నిర్ణయించుకున్న రోడ్ రోలర్ గుర్తును రద్దు చేసి బేబీ వాకర్ గుర్తును ఇటీవలే రిటర్నింగ్ అధికారి కేటాయించారు.

Munugode bypoll: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తునే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. రోడ్డు రోలర్‌ గుర్తును మొదట శివ కుమార్ పొందిన విషయం తెలిసిందే. అయితే, శివకుమార్ ప్రాధాన్యత గుర్తుగా నిర్ణయించుకున్న రోడ్ రోలర్ గుర్తును రద్దు చేసి బేబీ వాకర్ గుర్తును ఇటీవలే రిటర్నింగ్ అధికారి కేటాయించారు.

రోడ్ రోలర్ ఫ్రీ సింబల్ లో లేదని అందుకే యుగ తులసి పార్టీ అభ్యర్థికి బేబీ వాకర్ సింబల్ ఇస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు. గుర్తును మార్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మునుగోడు రిటర్నింగ్ అధికారి తెలపలేదు. దీంతో రోడ్ రోలర్ గుర్తు తొలగింపుపై అక్టోబరు 17న ఈసీకి శివకుమార్ ఫిర్యాదు చేశారు. తాను ఎంచుకున్న రోడ్ రోలర్ గుర్తును ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మార్చి ప్రాధాన్యత గుర్తుల్లో లేని బేబీ వాకర్ గుర్తును ఇచ్చారని చెప్పారు.

దీన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం రోడ్ రోలర్ ఫ్రీ సింబల్ లో ఉందని తెలిపింది. ఎన్నికల నిర్వహణ నియమావళి 10(5) 1961 చట్టంలోని నిబంధనలు రిటర్నింగ్ అధికారి ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గుర్తులను మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారికి, రిటర్నింగ్ అధికారికి లేఖలు రాసింది. గుర్తుల మార్పుపై ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..