Bhu Bharati Launch : భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం.. ఇంటి వద్ద నుంచే భూ సేవలు.. నేటి నుంచే ప్రారంభం.. కానీ
Bhu Bharati Launch : తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా రేవంత్ సర్కార్ కీలక ముందడుగు వేసింది.
integrated bhoobharti land portal launched in telangana from april 2 in selected five mandals
- తెలంగాణ సర్కార కీలక నిర్ణయం
- నేటి నుంచి భూ భారతి పోర్టల్ ప్రారంభం
- ముందుగా 5 మండలాల్లో అందుబాటులోకి
Bhu Bharati Launch : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన సమీకృత భూభారతి పోర్టల్‌తో తొలి అడుగు వేసింది. ఏప్రిల్ 2, గురువారం నుంచి రాష్ట్రంలోని 5 మండలాల్లో భూభారతి పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో రైతులు తమ భూవివరాలు, సమస్యల నమోదు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటి వద్ద కూర్చునే భూ సేవలను వినియోగించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా సమీకృత భూభారతి పోర్టల్ ద్వారా.. ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చామని తెలిపారు.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు మండలాల్లో.. ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నాం. ఈ చర్యలతో.. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామన్నారు. దానికి అనుగుణంగా భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రైతు కోణంలో రూపొందించాం. సామాన్య ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాము. ఆయా జిల్లా కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్ (ఎల్పీఎం)కు యూనిక్ నెంబరు ఉంటుంది. అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా ఇస్తామని వెల్లడించారు.
