Intintiki BJP : ఒక్కరోజే 35లక్షల కుటుంబాలతో మమేకం.. ఇంటింటికీ బీజేపీ పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం
Intintiki BJP : ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు.

Intintiki BJP (Photo : Twitter)
Intintiki BJP – Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటికీ బీజేపీ పేరుతో భారీ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది.
రేపు (జూన్ 22) ఒక్కరోజే 35లక్షల కుటుంబాలను బీజేపీ నేతలు కలవనున్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారీ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు.. రాష్ట్ర అధ్యక్షుడి వరకు ప్రజల్లోనే ఉండనున్నారు. ఒక్కో బూత్ అధ్యక్షుడు కనీసం వంద మంది కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందించారు.
రాష్ట్ర స్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు. నరేంద్ర మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రజలకు కలిగిన మేలును వివరించనున్నారు.
* కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీలలో బండి సంజయ్ పర్యటించనున్నారు.
* అంబర్ పేట గోల్నాకలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.
* ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీ నగర్ డివిజన్ లో డా.లక్ష్మణ్ పాల్గొననున్నారు.
* హుజురాబాద్ లో ఈటల రాజేందర్ పాల్గొంటారు.
* జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పాల్గొంటారు.
* ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరు వంద కుటుంబాలను కలుస్తారు.
తెలంగాణలో ఇంటింటికి బిజెపి. ఒకే రోజు 35 లక్షల మందితో మమేకమయ్యే కార్యక్రమం. ఒక్కో నాయకుడు కనీసం వంద కుటుంబాలతో కలిసి మాట్లాడే విధంగా ప్రణాళిక. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు. pic.twitter.com/Vnno8fVFUB
— BJP Telangana (@BJP4Telangana) June 21, 2023