Ips Transfers In Telangana
IPS Officers Transfers : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పలు విభాగాల్లో అధికారుల బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : High Court : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు జైలుశిక్ష
కొత్త సీపీలు వీరే..
హైదరాబాద్ సీపీ : కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
సైబరాబాద్ సీపీ : అవినాశ్ మహంతి
రాచకొండ సీపీ : సుధీర్ బాబు
నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ : సందీప్ శాండిల్యా
ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీగా ఉన్న దేవేంద్ర చౌహాన్ లను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read : Janardhan Reddy : టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించని గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. ఇటీవల ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ సీపీగాఉన్న సీవీ ఆనంద్ ను తప్పించి అతని స్థానంలో సందీప్ శాండిల్యను నియమించిన విషయం తెలిసిందే. అతని స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా అవినాశ్ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సందీప్ శాండిల్యను నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం అవినాశ్ మహంతి అదే కమిషనరేట్ పరిధిలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. సైబరాబాద్ సీపీగా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్రను డీజీపీ ఆఫీస్ కు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును ప్రభుత్వం నియమించింది. గతంలో సుధీర్ బాబు రాచకొండ అడిషనల్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుతం అతను ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న దేవేంద్ర చౌహాన్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.