Jagga Reddy (Image Credit To Original Source)
Jagga Reddy: సంగారెడ్డి నుంచి ఇక తాను జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
“గత ఎన్నికల్లో నా కోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి, నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే నన్ను ఇక్కడ ఓడించారు. అందుకే సంగారెడ్డిలో నేను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను. నా భుజంపై చేయి వేసి నన్ను గెలిపించాలని రాహుల్ అడిగితే నన్ను ఇక్కడి వారు ఓడించారు.
ఇది నా జీవితంలో మరిచిపోలేనిది. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు.. ఇక్కడి మేధావులు, పెద్దలు. రేపు సంగారెడ్డిలో నా భార్య నిర్మల పోటీ చేసినా కూడా నేను ప్రచారానికి రాను. రాష్ట్రంలో నేను ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయను” అని తెలిపారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డిపై చింత ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.