Congress: వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌లో ముగిసిన వివాదం

గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది.

Jagga Reddy

Congress: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ప్రధానంగా ఈ సమావేశంలో హుజురాబాద్ ఉపఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష జరిగింది. ఓటమిపై రేవంత్‌ను సీనియర్లు కార్నర్ చేయగా.. ఇదే విషయమై చర్చ జరిగింది. అభ్యర్థిని ముందే ప్రకటించకుండా ఎందుకు జాప్యం చేశారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం.. బట్టిపై విమర్శలు చేయడంతో వాతావరణం హీటెక్కింది.

అయితే, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జగ్గారెడ్డి చల్లబడ్డారు. దీంతో టీ కప్పులో తుఫాన్‌లా వివాదం ముగిసింది. తాను మాట్లాడిన మాటలను వదిలేయాలని సమావేశంలో అందరికీ విజ్ఞప్తి చేశారు జగ్గారెడ్డి. ఇకపై ఇలాంటి మాటలను మాట్లాడనని స్పష్టం చేశారు.

ఇకపై రాష్ట్రంలో పరిస్థితులపై మాట్లాడడనని, తన నియోజకవర్గంలో ఎలా గెలవాలో అనే విషయాలను మాత్రమే చూసుకుంటానని అన్నారు. ఎలాంటి వివాదాలకు వెళ్లనని జగ్గారెడ్డి వెల్లడించారు. జగ్గారెడ్డి వెనక్కి తగ్గడంతో వివాదం సమసిపోయింది.