Jalagam Venkat Rao : నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల వివరాలు వెల్లడించకపోవడంపై.. ఈసీకి లేఖ రాసిన జలగం వెంకట్రావు

అభ్యర్థులను ప్రకటించిన 72 గంటలలోపు నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల వివరాలను ఈసీకి వెల్లడించాలని నిబంధన ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను జతచేశారు.

Jalagam Venkat Rao : నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల వివరాలు వెల్లడించకపోవడంపై.. ఈసీకి లేఖ రాసిన జలగం వెంకట్రావు

Jalagam Venkat Rao

Updated On : October 25, 2023 / 9:01 PM IST

Jalagam Venkat Rao Letter : మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాశారు. తెలంగాణలో నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలను ఈసీకి సమర్పించకపోవటంపై జలగం వెంకట్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఈసీకి లేఖ రాశారు. జలగం వెంకట్రావు సుప్రీంకోర్టు తీర్పులను ఈసీకి అందజేశారు.

అభ్యర్థులను ప్రకటించిన 72 గంటలలోపు నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల వివరాలను ఈసీకి వెల్లడించాలని నిబంధన ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను జతచేశారు. బీహార్‌లో వివరాలు ప్రకటించని వివిధ రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానాలు విధించిందని జలగం వెంకట్రావు పేర్కొన్నారు.

DG Sanjay Bahadur : ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు.. రూ.53.93 కోట్లు, 156 కేజీల బంగారం, 464 కేజీల వెండి స్వాధీనం : ఐటీ డీజీ సంజయ్ బహదూర్