Pawan Kalyan : నేడు పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేస్తారు.

Pawan Kalyan : నేడు పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన

Pawan Kalyan

Updated On : May 20, 2022 / 8:56 AM IST

Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. చౌటుప్పల్‌ సమీపంలోని లక్కారం, కోదాడకు వెళ్లనున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేస్తారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ముందుగా చౌటుప్పల్‌ సమీపంలోని లక్కారం చేరుకుని.. కొంగర సైదులు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు.

అక్కడ నుంచి కోదాడ చేరుకుని.. కడియం శ్రీనివాస్‌ కుటుంట సభ్యులను పరామర్శిస్తారు. గత ఏడాది ఆగస్టు 20న బక్కమంతులగూడెం దగ్గర జరిగిన రోడ్‌ ప్రమాదంలో శ్రీనివాస్‌ మృతి చెందారు. లారీ- శ్రీనివాస్‌ బైక్‌ను ఢీకొనడంతో అకాల మరణం చెందాడు. పవన్‌ కల్యాణ్‌.. హుజూర్‌నగర్‌ వెళ్లి శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉంది.

Janasena Pawan Kalyan: బురద రాజకీయాలు చేతకాదు, రైతులకు అండగా నిలవడం మా బాధ్యత: పవన్

అయితే పర్యటన ఇబ్బందికరంగా మారడంతో కోదాడలోనే బాధిత కుటుంబ సభ్యులను పవన్‌ కళ్యాణ్ కలువనున్నారు. అనంతరం జనసేనాని కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పవన్‌ కల్యాణ్‌ టూర్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పవన్‌ పర్యటన సందర్భంగా కోదాడలో భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలతో కోదాడను నింపేశారు.