Jeevan Reddy: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వార్నింగ్

Jeevan Reddy: "నాలుగు ఊర్లు ఓట్లు వెయ్యకపోతే ఏం కాదు అని మంత్రి కొప్పుల అంటున్నారు. ప్రతిదీ ఓట్ల రాజకీయమేనా? మంత్రి కొప్పుల ఈశ్వర్ ను హెచ్చరిస్తున్నా.." అని జీవన్ రెడ్డి అన్నారు.

Jeevan Reddy

Jeevan Reddy: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశీగామ గ్రామంలో ఇథనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy). ఆయన ముందే పాశీగామ గ్రామ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. తమ ఆరోగ్యం, భూములు, పంట పొలాలు నాశనం అవుతాయని ఆవేదన చెందారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో తమ భూములు, ఇండ్లు పోయాయని కన్నీటి పర్యవంతం అయ్యారు పలువురు మహిళలు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్ మాట్లాడుతూ… మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) కు వార్నింగ్ ఇచ్చారు. “ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే వ్యర్థాలు గాలిలో నీటిలో కలుస్తాయి. దీంతో నాలుగు గ్రామాల ప్రజలకే కాక చుట్టుపక్క గ్రామాలకు సైతం ప్రమాదం ఏర్పడుతుంది.

సర్పంచ్, ఎంపీటీసీకి ఉన్న ఇంగిత జ్ఞానం మంత్రి కొప్పుల ఈశ్వర్ కు లేదు. ఇంత విషం కలిగించే క్రిబ్కో సంస్థకు ఇథనాల్ ప్రాజెక్టుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎందుకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు? దీని వల్ల క్రిబ్ కో సంస్థకు, ఆయనకు వచ్చే లాభాలు ఏంటీ? 13 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి భూమిని చదును చేయడమేంటీ? ఇదే ప్రాజెక్టు సిరిసిల్లలో పెడతామని అన్నారు.

మంత్రి కేటీఆర్ ఏ పరిశ్రమ వచ్చినా ఆయనే తెచ్చానని చెప్పుకుంటారు. ఇథనాల్ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగనట్లయితే సిరిసిల్లలో పెట్టుకో మంత్రి కేటీఆర్.. విషతుల్యమైన ఇథనాల్ ప్రాజెక్టు కావడంతోనే సిరిసిల్లలో నిర్మించట్లేదు. ఇథనాల్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన ఉంది.

నాలుగు ఊర్లు ఓట్లు వెయ్యకపోతే ఏం కాదు అని మంత్రి కొప్పుల అంటున్నారు. ప్రతిదీ ఓట్ల రాజకీయమేనా? మంత్రి కొప్పుల ఈశ్వర్ ను హెచ్చరిస్తున్నా.. ఇది ఓన్లీ వెల్గటూర్ మండలానికి సంబంధించిన విషయమే కాదు. ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ ది.

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో ధర్మపురి నియోజకవర్గాన్ని నిండా ముంచారు. వందమంది మంత్రి కొప్పుల ఈశ్వర్లు వచ్చినా ఇక్కడ ఇథనాల్ ప్రాజెక్టు నిర్మించలేరు. పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉన్నారా? లేదా విఘాతం కలిగించే విధంగా ఉన్నారా? ప్రజలకు సంఘీభావం తెలపడానికి వస్తే రెండుసార్లు హౌస్ అరెస్టు చేశారు. టెంట్లు వేస్తే ఖబర్దార్ అంటున్నారు పోలీసులు” అని జీవన్ రెడ్డి అన్నారు.

Katasani Rambhupal Reddy : కొండారెడ్డి బురుజా? నీ టెంటా? దమ్ము, ధైర్యముంటే రా.. నారా లోకేశ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్