JNTU Hyderabad : జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ఎగ్జామ్స్ వాయిదా
వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జులై 21 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.

Jntu Hyd
JNTU Hyderabad : భారీ వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. బీటెక్, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జులై 21 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించిన విషయం విదితమే. ఈ నెల 16 వరకు సెలవులు ప్రకటించారు. 18న విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. అలాగే రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల పరిధిల్లో రేపటి నుంచి శనివారం వరకు జరుగనున్న పలు పరీక్షలను వాయిదా వేశారు.
TS Polycet-2022 : తెలంగాణ పాలిసెట్ -2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలను కూడా వాయిదా వేశారు. గురు, శుక్రవారాల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.