Jubilee Hills Rape Case
Jubilee Hills Rape Case : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. నిందితులు గోవా పారిపోయినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. ఒక టీమ్ ను గోవాకు పంపారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ స్పీడప్ కావడంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలో కీలక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలితో పాటు నిందితులంతా కలిసి జూబ్లీహిల్స్ లోని అమ్నేసియా పబ్ లో పార్టీ చేసుకున్నారు. వీళ్లంతా పబ్ ముందు నవ్వుతూ మాట్లాడుకున్నట్లు ఆ విజువల్స్ లో కనిపిస్తోంది. చాలాసేపు చిట్ చాట్ తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లేదాకా పబ్ ముందున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత బాలికను కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
MLA Raja Singh : వాహనాలు రేప్ చేశాయా? జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు
రెండు గంటల తర్వాత అదే పబ్ ముందు మరో కారు వచ్చి ఆగింది. కారులోంచి బయటకు దిగిన అమ్మాయి ఎలాగో అలా ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ముభావంగా ఉంటోంది. ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. దీంతో ఆమె పేరెంట్స్ కు అనుమానం వచ్చింది. కుమార్తె ముఖం, మెడపై గాయాలు కనిపించడంతో భయపడిపోయారు. అసలేం జరిగిందో చెప్పాలని బతిమాలడంతో అసలు విషయం బయటపడింది. గుర్తు తెలియని యువకులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయింది. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
తన బిడ్డతో కొంతమంది అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. సూరత్, హరి అనే ఫ్రెండ్స్ కలిసి బయటకు తీసుకెళ్లినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో పబ్ నుంచి బయటకు వచ్చిన తన కుమార్తెను కొందరు యువకులు బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు ఇచ్చారు. ఆమె శరీరంపై గాయాలు కూడా చేశారని, అప్పటి నుంచి తన కుమార్తె షాక్ లో ఉందని పోలీసులతో చెప్పారు. ఆ తర్వాత పోలీసులు బాధితురాలిని భరోసా సెంటర్ కు తరలించారు. అక్కడే గ్యాంగ్ రేప్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడంతో బాలిక కాస్త తేరుకుంది. తనపై ఐదుగురు యువకులు లైంగిక దాడి చేశారని చెప్పింది.