MLA Raja Singh : వాహనాలు రేప్ చేశాయా? జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు

ఎఫ్ఐఆర్ లో బెంజ్, ఇన్నోవా వాహనాల పేర్లు మాత్రమే ప్రస్తావించారు. అంటే వాహనాలు రేప్ చేశాయా? అని అడిగారు రాజాసింగ్.

MLA Raja Singh : వాహనాలు రేప్ చేశాయా? జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు

Bjp Mla Raja Singh

MLA Raja Singh : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. రాజకీయ రంగు పులుముకుంది. ఘటన జరిగి ఇన్ని రోజులు కావొస్తున్నా నిందితులను పట్టుకోకపోవడంపై విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. పోలీసులు, ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

28న బాధితులు ఫిర్యాదు చేస్తే.. మూడు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రాజాసింగ్ మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఇంత ఆలస్యం ఎందుకు అని పోలీసులను ప్రశ్నించారాయన. ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లు ఎందుకు లేవని నిలదీశారు. ఎఫ్ఐఆర్ లో బెంజ్, ఇన్నోవా వాహనాల పేర్లు మాత్రమే ప్రస్తావించారని, అంటే వాహనాలు రేప్ చేశాయా? అని అడిగారు రాజాసింగ్.

Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్‌ కేసు.. రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం

నిందితుల్లో ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల కొడుకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, దీంతో నిందితుల పేర్లను మార్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు రాజాసింగ్. ఈ కేసుని పోలీస్ కమిషనర్ సీరియస్ గా తీసుకోవాలని, నిందితుల పేర్లను బయటపెట్టడంతో పాటు వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారాయన.

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మరో ఎమ్మెల్యే రఘు నందన్ రావు సైతం ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

”విచారణ పూర్తయ్యే వరకు హోంమంత్రిని తొలగించాలి. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి. అమ్మాయి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి. న్యాయం కోసం హైకోర్టులో పిల్ వేస్తాం. తెలంగాణలో ధృతరాష్ట్రుని పాలన కొనసాగుతోంది. హోంమంత్రి మనవడు ఇచ్చిన బ్యాచిలర్స్ పార్టీ వల్లనే రేప్ ఘటన జరిగింది. ట్విట్టర్ పక్షి కవిత ఈ విషయంపై ఎందుకు కూయడం లేదు? అమ్మాయిని పబ్‌లోకి ఎలా అనుమతించారో సమాధానం చెప్పాలి.

నిందితులపై కాకుండా కారుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సిగ్గు చేటు. పోలీసుల విచారణలో పారదర్శకత లోపించింది. బోధన్ ఎమ్మెల్యే కేసు ఇప్పటికీ అతీగతీ లేదు’’ అని రఘునందన్ రావు ధ్వజమెత్తారు.

Jubilee Hills GangRape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. అసలేం జరిగిందో చెప్పిన అమ్నేసియా పబ్ మేనేజర్

జూబ్లీహిల్స్‌లో అమ్నేసియా పబ్ కు వచ్చిన 17 ఏళ్ల బాలికను కారులో ఇంటికి తీసుకెళ్తామని నమ్మించిన కొందరు యువకులు ఆమెపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఎమ్మెల్యే కుమారుడు, మరొకరు ప్రజా ప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నట్టు సమాచారం. అత్యాచారం అనంతరం బాలికను అదే పబ్ దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది. బాలిక మెడ చుట్టూ గాయాలు గమనించిన తండ్రి విషయం ఆరా తీశాడు. దీంతో అత్యాచారం విషయం బయటపడింది. గత నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.