Jubilee Hills Has The Best Air Quality In Hyderabad Aqi Report
best air quality in Hyderabad : హైదరాబాద్ లాంటి మహానగరంలో కాలుష్య వాతావరణం పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ లెవల్ కూడా కొన్నిచోట్ల దారుణంగా మారిపోయింది. నగరవాసులకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి లేన్నట్టుగా ఉంది. వాహనాల్లో నుంచి విడుదలయ్యే ఉద్గారాలు, పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో నగరంలోని వాతావరణమంతా కాలుష్యమవుతోంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే లేదాయే.. కానీ, నగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడో తెలుసా? అదేనండీ.. మన జూబ్లీహిల్స్, రెండో ప్రాంతం ఉప్పల్.. ఇటీవలే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ( TSPCB) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( AQI ) నివేదిక విడుదల చేసింది.
Ganesh Immersion : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
ఈ రిపోర్టులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రెండు ప్రాంతాల్లోనే స్వచ్ఛమైన గాలి దొరుకుతోందని తేలింది. సిటీలో నాణ్యమైన గాలి దొరికే ప్రాంతమేదైనా ఉందంటే.. అది జూబ్లీ హిల్స్ మాత్రమేనని నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత ఉప్పల్ ప్రాంతం.. ఇది ఇండస్ర్టియల్ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ కూడా నాణ్యమైన స్వచ్ఛమైన గాలి ఉందని గుర్తించారు. సెప్టెంబర్ 7న జూబ్లీహిల్స్, ఉప్పల్ ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత 30 నుంచి 50 మధ్య ఉన్నట్టుగా నమోదైంది. సెప్టెంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్‌లో గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉందని గుర్తించారు. ఇదే సమయంలో ఉప్పల్‌లో గాలి నాణ్యత తగినంత స్థాయిలో ఉందని తేలింది.
ఈ రెండు ప్రాంతాలతోపాటు ప్యారడైజ్, చార్మినార్, బాలానగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగుందని నివేదిక తెలిపింది. అలాగే జీడిమెట్లలో గాలి నాణ్యతలో ఎలాంటి మార్పు కనిపించలేదని పేర్కొంది. సాధారణంగా గాలి నాణ్యత 0 నుంచి 50 మధ్య ఉంటే బాగుందని గుర్తించారు. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరంగానే ఉన్నట్టు తెలిపారు. 101-200 మధ్య గాలి నాణ్యత ఉంటే మాదిరిగా ఉంది. 201-300 మధ్య గాలి నాణ్యత ఉంటే పూర్‌గా ఉన్నట్టు.. అలాగే 301-400 మధ్య ఉంటే చాలా పూర్‌గా ఉందని, 400 లోపు ఉంటే మరింత తీవ్రంగా కాలుష్యం ఉందని నివేదిక వెల్లడించింది.
Telugu States : రక్తమోడిన రోడ్లు, భార్య కళ్లెదుటే భర్త మృతి, రెడిమిక్స్ వాహనం కింద యువకుడు నుజ్జునుజ్జు