Hyderabad: సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్య

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్య కలకలం రేపుతుంది.

Hyderabad: సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్య

Suicide

Updated On : October 23, 2021 / 1:33 PM IST

Hyderabad: చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్య కలకలం రేపుతుంది. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉండే సైద్ రహీమ్ అనే 24ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను అసలు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఏంటన్న విషయం మాత్రం బయటకు రాలేదు.

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదనే నిరాశతో చనిపోయాడా? లేక సూసైడ్‌కు మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై విచారణ జరుగుతోంది.