Telangana : మంత్రితో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
మంత్రితో జరిపిన చర్చలు సఫలం కావటంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు.

minister damodar raja narasimha : తెలంగాణలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించారు. వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్శింహతో జరిపిన చర్చలు సఫలం కావటంతో జూడాలు సమ్మె విరమించారు. వారి సమస్యల్ని విన్న మంత్రి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి దామోదర ఇచ్చిన హామీతో జూడాలు సమ్మె విరమించారు. ప్రతీ నెలా 15తేదీ లోపు స్టైఫండ్ అందేలా చూస్తామని మంత్రి హామి ఇచ్చారు. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు.
కాగా..తమకు మూడు నెలల నుంచి స్టైఫండ్ అందటంలేదు అంటూ తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. మూడు నెలలుగా తమకు స్టై ఫండ్ రాక చాలా ఇబ్బందులు పడ్డామని అందుకే సమ్మె చేపట్టామని తెలిపారు. మంత్రి తమకు హామీ ఇచ్చారని 15లోపే అందేలా చూస్తామని హామీ ఇచ్చారని దీంతో సమ్మె విరమించామని తెలిపారు.