kalvakuntla kavitha
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికను పరామర్శించారు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని కలుషితాహారం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆ
మె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కల్వకుంట్ల కవిత ఆమెను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సగటున నెలకు ముగ్గురు విద్యార్థులు ఆశ్రమ పాఠశాలల్లో మృతి చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని అన్నారు.
అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నత లక్ష్యాలతో ఆ విద్యాసంస్థలు నడిచాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సమీక్ష నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దాలని ఆమె డిమాండ్ చేశారు. మృతి చెందిన 42 మంది విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం చెల్లించాలని అన్నారు.
దటీజ్ పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని మార్క్..! సంబరాల్లో జన సైనికులు..