RS Praveen Kumar : రేవంత్ రెడ్డిది మంత్రుల క్యాబినెట్ కాదు.. మాఫియా డాన్ల క్యాబినెట్

RS Praveen Kumar : రేవంత్ రెడ్డిది మంత్రుల క్యాబినెట్ కాదు.. మాఫియా డాన్ల క్యాబినెట్ అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

RS Praveen Kumar : రేవంత్ రెడ్డిది మంత్రుల క్యాబినెట్ కాదు.. మాఫియా డాన్ల క్యాబినెట్

RS Praveen Kumar

Updated On : October 16, 2025 / 2:30 PM IST

RS Praveen Kumar : రేవంత్ రెడ్డిది మంత్రుల క్యాబినెట్ కాదు.. మాఫియా డాన్ల క్యాబినెట్ అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, రోహిణ్ రెడ్డి, పొంగులేటి కాల్ డేటా బయటకుతీస్తే దొంగల ముఠా బయటకు వస్తుందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై, మంత్రులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో కొండా కుమార్తె సుస్మితా పటేల్ నిజాలు చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిణి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారాడు. ముఖ్యమంత్రి అనుచరుడు రోహిణ్ రెడ్డి ఆఫీస్‌లోనే తుపాకీ పెట్టి బెదిరించటమే ఇందుకు నిదర్శనం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరుతామని ప్రవీణ్ కుమార్ అన్నారు.

Also Read : Konda Surekha OSD : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సుమంత్ పేరు.. ఎవరీ సుమంత్? ఏంటీ అసలు గొడవ?.. ఫుల్ డిటెయిల్స్

డక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళను బెదిరించిన వెపన్ ఎవరిదో విచారించాలి. రాష్ట్రాన్ని పాలిస్తుంది మీనాక్షి నటరాజనా? రేవంత్ రెడ్డినా? కమిషన్ పంపకాల్లో తేడా రావటం వలనే.. మంత్రులు మధ్త కొట్లాటలు జరుగుతున్నాయి. మంత్రి ఇంటికి వెళ్ళి నిందితుడిని పట్టుకురాలేని పరిస్థితి ప్రభుత్వానిది. రేవంత్ రెడ్డి హాయాంలో తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయింది అంటూ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

మంత్రులు స్థానంలో మాఫియా డాన్లు కూర్చున్నారు. తనను మంత్రి పొంగులేటి చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మీ జవాన్ చెప్పినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. స్థానిక ఏసీపీ తిరుపతి రెడ్డి ఫిర్యాదు తీసుకోవటం లేదని ఆర్మీ జవాన్ స్వయంగా చెప్తున్నారు. అవినీతిలో వాటాలకోసం మంత్రులు బహిరంగంగా కొట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు దుకాణాలు తెరుచుకుని ప్రజలను దోచుకుంటున్నారు.

సామాన్యులకు ఒక న్యాయం.. మంత్రులకు మరొక న్యాయమా? డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎపిసోడ్‌పై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ కు నడుచుకుని వస్తే.. కేటీఆర్ పై కేసు పెట్టారు అంట్టూ గుర్తు చేశారు.