chandrababu naidu
Telugu Desam Party: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేరారు. శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాసాని టీడీపీలో చేరారు. జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Chandrababu : వేంకటేశ్వరస్వామి వల్లే బతికి ఉన్నా.. అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటనపై చంద్రబాబు..
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ రోజురోజుకు ప్రాబల్యం కోల్పోతుంది. కీలక నేతలు ఇప్పటికే పార్టీ వీడారు. తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ తెదేపాలో చేరడంతో క్యాడర్ లో కొంత ఉత్సాహాన్ని నింపినట్లయింది. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు. రానున్న రోజుల్లో టీటీడీపీ పగ్గాలు కాసానికి అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.