Kodandaram : ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ : కోదండరాం

కేసీఆర్ పై ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని రెండూ ఒకటేనని పేర్కొన్నారు.

Kodandaram : ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ : కోదండరాం

Kodandaram – KCR : సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం పేర్కొన్నారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పోటీ చేయమంటే రెండో చోట చేస్తున్నానని చెప్తున్న కేసీఆర్..  మరి 119 మంది అడిగితే 119 స్థానాల్లో చేస్తారా అని ప్రశ్నించారు.

ఈ మేరకు గురువారం కోదండరాం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని రెండూ ఒకటేనని పేర్కొన్నారు. కాబట్టి కొట్లాడితే రెండింటిపై కొట్లాడాలని పిలుపు నిచ్చారు.

Podem Veeraiah : భద్రాచలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాసా.. రేగా కాంతారావు మాట్లాడకుండా మైక్ లాక్కున్న పొదెం వీరయ్య

దోపిడీ రాజ్యం పోయి సామాజిక తెలంగాణ రావాలని ఆకాంక్షించారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో తమ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. పొత్తుల విషయాన్ని కాంగ్రెస్ త్వరగా తేలిస్తే మంచిదని చెప్పారు. లెఫ్ట్ పార్టీ లకు కేసీఆర్ పై ఉన్న భ్రమలు తొలిగిపోయాయని, ఇది మంచి పరిణామమని తెలిపారు.