KCR Kondagattu Tour : కొండగట్టుకు సీఎం కేసీఆర్.. ఆలయ అభివృద్ధిపై ఫోకస్
సీఎం కేసీఆర్ రేపటి కొండగట్టు టూర్ వాయిదా పడింది. ఎల్లుండి కొండగట్టుకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం కేసీఆర్.

KCR Kondagattu Tour : సీఎం కేసీఆర్ రేపటి కొండగట్టు టూర్ వాయిదా పడింది. ఎల్లుండి కొండగట్టుకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం కేసీఆర్.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఎల్లుండి సీఎంతో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కూడా కొండగట్టుకి వెళ్లనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్దిలో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దాదాపు 2 గంటల పాటు సీఎం కేసీఆర్ కొండగట్టులో ఉండనున్నారు.
ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ధూప, దీప నైవేద్యాలకు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఆలయాలకు వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా యాదాద్రి తరహాలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఇందుకోసం రూ.100 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొండగట్టుకి నిధులు కేటాయించిన తర్వాతే ఆలయంలో అడుగు పెడతానన్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు. ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో కొండగట్టు కొత్త రూపు దిద్దుకోనుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైన గుడి. ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామిని మహిమాన్వితుడిగా భక్తులు కొలుస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు.